Apr 1, 2013

Tiyateeyani Kalalanu

తియ తియ్యని కలలను కనడమే తెలుసు కమ్మనీ ప్రేమలో
మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో
ఎన్నాళ్ళయినా నేనుండి పోగలను నీ కౌగిళ్ళలో
నేనెవరన్నది నే మరచిపోగలను చూస్తూ నీ కళ్ళలో
తియ తియ్యని కలలను కనడమే తెలుసు కమ్మనీ ప్రేమలో
మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో

చల చల్లని మంచుకి అర్ధమే కాదు ప్రేమ చలవేమిటో
నునువెచ్చని మంటలు ఎరగవేనాడు ప్రేమ సెగలేమిటో
వచ్చీ రాని కన్నీరుకే తెలుసు ప్రేమ లోతేమిటో
ముద్దే లేని అధరాలకే తెలుసు ఈడు బాధేమిటో

తియ తియ్యని కలలను కనడమే తెలుసు కమ్మనీ ప్రేమలో
మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో

మురిపెంతో సరసం తీర్చమంటోంది ప్రాయమీ వేళలో
తమకంతో దూరం తెంచమంటోంది తీపి చెరసాలలో
విరహంతో పరువం కరిగిపోతోంది ఆవిరై గాలిలో
కలిసుంటే కాలం నిలిచిపోతుంది ప్రేమ సంకెళ్ళలో

తియ తియ్యని కలలను కనడమే తెలుసు కమ్మనీ ప్రేమలో
మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో

tiya tiyyani kalalanu kanaDamE telusu kammanI prEmalO
manasaMtA nuvvani cheppaDaM telusu prEmanE mattulO
ennALLayinA nEnuMDi pOgalanu nI kaugiLLalO
nEnevarannadi nE marachipOgalanu chUstU nI kaLLalO
tiya tiyyani kalalanu kanaDamE telusu kammanI prEmalO
manasaMtA nuvvani cheppaDaM telusu prEmanE mattulO

chala challani maMchuki ardhamE kAdu prEma chalavEmiTO
nunuvechchani maMTalu eragavEnADu prEma segalEmiTO
vachchI rAni kannIrukE telusu prEma lOtEmiTO
muddE lEni adharAlakE telusu IDu bAdhEmiTO

tiya tiyyani kalalanu kanaDamE telusu kammanI prEmalO
manasaMtA nuvvani cheppaDaM telusu prEmanE mattulO

muripeMtO sarasaM tIrchamaMTOMdi prAyamI vELalO
tamakaMtO dUraM teMchamaMTOMdi tIpi cherasAlalO
virahaMtO paruvaM karigipOtOMdi Avirai gAlilO
kalisuMTE kAlaM nilichipOtuMdi prEma saMkeLLalO

tiya tiyyani kalalanu kanaDamE telusu kammanI prEmalO
manasaMtA nuvvani cheppaDaM telusu prEmanE mattulO

No comments:

Post a Comment

Have your say..

My Blog List

Blog Archive