బుడుంగు బుడుంగుమంటున్నాయి మునకేస్తుంటే నీళ్ళు
ఆ సౌండ్‌కి మీనింగేమిటో సరిగా చెప్పేవాళ్ళు ఎవరు
బుడుగూ బుడుగూ అంటూ నిన్ను పిలుస్తున్నవిర పిడిగూ
నీ బుజ్జి బుర్రలో పుట్టే ప్రశ్నల్లాంటివిరా ఈ బుడగలు
మాట తప్పించుతారే సారూ మమ్మీలాగే మీరు
పాటల్లోనే చెబుతాగా నీ డౌటుని తీర్చే ఆన్సరు
what is right - what is right
what is wrong - what is wrong
what is what - what is what
చెప్పగలవాడు పుట్టలేదురా
what is what
లాజిక్కు మ్యాజిక్కుల్లో ఇప్పట్నుంచే మునిగిపోకు శిశువా
what is what
లాజిక్కే చేతయ్యుంటే మీరిట్టాగ జారిపోరు గురువా
చుక్కలాంటి చిన్నదాని చెక్కిలంతా ఎర్రబడ్డదేల..
అలకా చిలకా అన్నం తినని తగువా
మనవే వినవా అన్నా చెట్టే దిగవా
చేసిందంతా చేసేశాక నంగనాచి మంచి మాటలేల..
కసిరి విసిరి పైగా జాలి ఒకటా
అలకా గిలకా అంటూ కంటి తుడుపా
సరదాగా జోకులు వేస్తున్నా వరదల్లే నవ్వొచ్చేస్తున్నా
పకాలమంటూ పైకి నవ్వరే ముఖాలు ముడుచుక్కూర్చుంటారే
ఆవులించితే పేగుల్లెక్కెట్టేసే వేగులు ఉంటారబ్బాయ్
అందుచేతనే పెదాలు బిగించి తాళం వేయడం బెస్ట్ అబ్బాయ్
మాటవరసకి నీకు ఎన్నో సీక్రెట్లుంటాయ్ చెప్పేస్తావా?
కితకితలెడితే మాత్రం నవ్వి లోపలిదంతా బైటెడతావా?
అబ్బ ఆశ దోశె అప్పడం తెలుసు గురూజీ నీ ఎత్తు
అటు తిప్పి ఇటు తిప్పి చివరికి నాకే పెడతారా ఎర్తు?
what is right - what is right
what is wrong - what is wrong
what is what - what is what
చెప్పగలవాడు పుట్టలేదురా
what is what
లాజిక్కు మ్యాజిక్కుల్లో ఇప్పట్నుంచే మునిగిపోకు శిశువా
what is what
లాజిక్కే చేతయ్యుంటే మీరిట్టాగ జారిపోరు గురువా
ఏం మాటంటే ఏమౌతుందో నీ మూడెప్పుడు పాడవుతుందో ఏమో..
తెలిసే తెలివే ఉంటే పేచీ అవునా?
సారీ నారి అంటూ రాజీ పడనా?
మొత్తం నేరం నాదేలెండి మీకేం పాపం తెలియదులెండి అవునా..
అదితే ఇదితే అంటూ సాధించానా?
ఎదురే తిరిగి మహా వేధించానా ఏమన్నా?
మనకేమవుతారో తెలియని వాళ్ళని మగాళ్ళనయితే అంకుల్ అనీ
ఆడాళ్ళని ఆంటీలు అనీ అనమని నేర్పిన అమ్మ
మిమ్మల్నంకుల్ అనొద్దంటుందేం ఖర్మ
ఎవరికి ఎవరెవెవరేమవుతారో తెలిపే శాస్త్రం ఫిలాసఫీ
ఆ సబ్జెక్ట్లో Phd గల ఆవిణ్ణే నువ్వడుగబ్బి
మగాళ్ళే కదా మీరు మరి నాకంకుల్ కాక మరేమౌతారు?
భేతాళున్లా నన్నెందుకురా బేజారెత్తిస్తావు?
జవాబు తెలిసీ చెప్పకపోతే మెదడు నువ్వు మేసేస్తావు
నోరు జారి చెప్పేశానంటే అహ అమ్మమ్మో
what is right - what is right
what is wrong - what is wrong
what is what - what is what
చెప్పగలవాడు పుట్టలేదురా
what is what
లాజిక్కు మ్యాజిక్కుల్లో ఇప్పట్నుంచే మునిగిపోకు శిశువా
what is what
లాజిక్కే చేతయ్యుంటే మీరిట్టాగ జారిపోరు గురువా
ఊళ్ళో అంతా పన్లే మాని నిన్నూ నన్ను చూస్తూ ఉంటే పరువా..
అణిగి మణిగి ఉన్నా కదా అతివా
అయినా రోజూ నాతో ఏదో గొడవ
పెళ్ళామంటే ఏం బెదురండి వేళాకోలం చాలించండి ఔరా..
నాతో నీకే కయ్యాలంటే సరదా
అయినా నాకే గయ్యాలంటూ బిరుదా?
buDungu buDungumanTunnAyi munakEstunTE nILLu
A sounDki meaningEmiTO sarigA ceppEvALLu evaru
buDugU buDugU anTU ninnu pilustunnavira piDigU
nI bujji burralO puTTE praSnallAnTivirA I buDagalu
mATa tappincutArE sArU mammIlAgE mIru
pATallOnE cebutAgA nI DouTuni tIrcE Ansaru
what is right - what is right
what is wrong - what is wrong
what is what - what is what
ceppagalavADu puTTalEdurA
what is what
lAjikku myAjikkullO ippaTnuncE munigipOku SiSuvA
what is what
lAjikkE cEtayyunTE mIriTTAga jAripOru guruvA
cukkalAnTi cinnadAni cekkilantA errabaDDadEla..
alakA cilakA annam tinani taguvA
manavE vinavA annA ceTTE digavA
cEsindantA cEsESAka nanganAci manci mATalEla..
kasiri visiri paigA jAli okaTA
alakA gilakA anTU kanTi tuDupA
saradAgA jOkulu vEstunnA varadallE navvoccEstunnA
pakAlamanTU paiki navvarE mukhAlu muDucukkUrcunTArE
AvulincitE pEgullekkeTTEsE vEgulu unTArabbAy
anducEtanE pedAlu biginci tALam vEyaDam besT abbAy
mATavarasaki nIku ennO sIkreTlunTAy ceppEstAvA?
kitakitaleDitE mAtram navvi lOpalidantA baiTeDatAvA?
abba ASa dOSe appaDam telusu gurUjI nI ettu
aTu tippi iTu tippi civariki nAkE peDatArA ertu?
what is right - what is right
what is wrong - what is wrong
what is what - what is what
ceppagalavADu puTTalEdurA
what is what
lAjikku myAjikkullO ippaTnuncE munigipOku SiSuvA
what is what
lAjikkE cEtayyunTE mIriTTAga jAripOru guruvA
Em mATanTE EmoutundO nI mUDeppuDu pADavutundO EmO..
telisE telivE unTE pEcI avunA?
sArI nAri anTU rAjI paDanA?
mottam nEram nAdElenDi mIkEm pApam teliyadulenDi avunA..
aditE iditE anTU sAdhincAnA?
edurE tirigi mahA vEdhincAnA EmannA?
manakEmavutArO teliyani vALLani magALLanayitE ankul anI
ADALLani AnTIlu anI anamani nErpina amma
mimmalnankul anoddanTundEm kharma
evariki evarevevarEmavutArO telipE SAstram filAsafI
A sabjekTlO Phd gala AviNNE nuvvaDugabbi
magALLE kadA mIru mari nAkankul kAka marEmoutAru?
bhEtALunlA nannendukurA bEjArettistAvu?
javAbu telisI ceppakapOtE medaDu nuvvu mEsEstAvu
nOru jAri ceppESAnanTE aha ammammO
what is right - what is right
what is wrong - what is wrong
what is what - what is what
ceppagalavADu puTTalEdurA
what is what
lAjikku myAjikkullO ippaTnuncE munigipOku SiSuvA
what is what
lAjikkE cEtayyunTE mIriTTAga jAripOru guruvA
ULLO antA panlE mAni ninnU nannu cUstU unTE paruvA..
aNigi maNigi unnA kadA ativA
ayinA rOjU nAtO EdO goDava
peLLAmanTE Em beduranDi vELAkOlam cAlincanDi ourA..
nAtO nIkE kayyAlanTE saradA
ayinA nAkE gayyAlanTU birudA?
Raashi Khanna Glamorous Heroine of South Cinema
-
Raashi Khanna is an Indian actress and model who predominantly works in the
Telugu film industry. She debuted as an actress with the Hindi film Madras
Ca...
No comments:
Post a Comment
Have your say..