ఎవరో ఎవరో ఎదలో ఎవరో
అనుకోని వరమై చేరె అమృతాల వరదై పారె
తన పేరే ప్రేమ తనదే ఈ మహిమ
తనదే తొలి జన్మ తరువాతే బ్రహ్మ
ఎవరో ఎవరో ఎదలో ఎవరో
చూపుల్లో పున్నమి రేఖలుగా
రూప౦లో పుత్తడి రేఖలుగా
మారింది జీవనరేఖ నా హృదయంలో తానే చేరాక
అధరాలే మన్మథ లేఖ రాయగా
అడుగేమో లక్ష్మణ రేఖ దాటగా
బిడియాల బాటలో నడిపే వారెవరో
బడిలేని పాఠమే నేర్పే తానెవరో
విడిపోని ముడివేసి మురిసేదెవ్వరో
ఎవరో ఎవరో..
మల్లెలలతో స్నానాలే పోసి
నవ్వులతో నగలెన్నో వేసి
చీకటితో కాటుక పెట్టి నన్నే తాను నీకై పంపింది
సొగసంతా సాగరమల్లే మారదా
కవ్వింత కెరటాలల్లే పొంగగా
సరసాల నావలో చేరే వారెవరో
మధురాల లోతులో ముంచే తానెవరో
పులకింత ముత్యాలే పంచేదెవ్వరో ఎవరో..
ఎవరో ఎవరో ఎదలో ఎవరో
అనుకోని వరమై చేరె అమృతాల వరదై పారె
తన పేరే ప్రేమ తనదే ఈ మహిమ
తనదే తొలి జన్మ తరువాతే బ్రహ్మ
ఎవరో ఎవరో ఎదలో ఎవరో
evarO evarO edalO evarO
anukOni varamai chEre amRtAla varadai pAre
tana pErE prEma tanadE I mahima
tanadE toli janma taruvAtE brahma
evarO evarO edalO evarO
chUpullO punnami rEkhalugA
rUpa~0lO puttaDi rEkhalugA
mArindi jIvanarEkha nA hRdayamlO tAnE chErAka
adharAlE manmatha lEkha rAyagA
aDugEmO lakshmaNa rEkha dATagA
biDiyAla bATalO naDipE vArevarO
baDilEni pAThamE nErpE tAnevarO
viDipOni muDivEsi murisEdevvarO
evarO evarO..
mallelalatO snAnAlE pOsi
navvulatO nagalennO vEsi
chIkaTitO kATuka peTTi nannE tAnu nIkai pampindi
sogasantA sAgaramallE mAradA
kavvinta keraTAlallE pongagA
sarasAla nAvalO chErE vArevarO
madhurAla lOtulO munchE tAnevarO
pulakinta mutyAlE panchEdevvarO evarO..
evarO evarO edalO evarO
anukOni varamai chEre amRtAla varadai pAre
tana pErE prEma tanadE I mahima
tanadE toli janma taruvAtE brahma
evarO evarO edalO evarO
Raashi Khanna Glamorous Heroine of South Cinema
-
Raashi Khanna is an Indian actress and model who predominantly works in the
Telugu film industry. She debuted as an actress with the Hindi film Madras
Ca...
No comments:
Post a Comment
Have your say..