ఒంటరైన గుండెలో తీగలేని వీణలు
మోగుతున్న మూగ రాగమేమో
నిద్రలేని నిన్నని మేలుకోని రేపుని
చూపుతున్న నేటి రాతిరేమో
సుదూర తీరాల జ్ఞాపకాలే
సమీపమౌతున్న జాడలా
ఉండుండి వీచేటి ఈ గాలిలో
ఒంటరైన గుండెలో తీగలేని వీణలు
మోగుతున్న మూగ రాగమేమో
నిద్రలేని నిన్నని మేలుకోని రేపుని
చూపుతున్న నేటి రాతిరేమో
కంటి చాటు సాగరాలు ఇంతకాలమేడ దాగెనో
అనురాగ సంగమం ఈ క్షణమే
రెప్పదాటు ఉప్పు నీట చెప్పలేని తీపి ఏమిటో
కరిగించు ఈ క్షణం అమృతమే
సుమాలు తించిన గతాల మంచునే
క్షమించి చేరువైన తేనె జల్లిది
చినుకు వంతెనెంత చేరుకుంది నీలి నింగి నేలకి
చిగురు తొడుగు తడిని తెలపదా
ఏడేడు జన్మాల స్నేహాలతో
ఒంటరైన గుండెలో తీగలేని వీణలు
మోగుతున్న మూగ రాగమేమో
నిద్రలేని నిన్నని మేలుకోని రేపుని
చూపుతున్న నేటి రాతిరేమో
వేడి శ్వాస వేణువైన నాడిలోని నాదమేవిటో
తెలవారు వేళకై స్వాగతమే
ఉడికించు ఆశలోన భాషలేని భావమేవిటో
ఒడి చేరు ఊసులో సంబరమే
తనంత తానుగా వసంత వాకిట
ఎడారి దారి చేరి పూల పూయగా
కలల కోకిలమ్మ పాడుతోంది మనసు మావితోటలో
చెలిమి చిలుకు ఛైత్ర గీతిక
తియ్యంగా తేనీటి దాహాలతో
ఒంటరైన గుండెలో తీగలేని వీణలు
మోగుతున్న మూగ రాగమేమో
నిద్రలేని నిన్నని మేలుకోని రేపుని
చూపుతున్న నేటి రాతిరేమో
లల లల లల లల లలల..
onTaraina gunDelO tIgalEni vINalu
mOgutunna mUga rAgamEmO
nidralEni ninnani mElukOni rEpuni
cUputunna nETi rAtirEmO
sudUra tIrAla j~nApakAlE
samIpamoutunna jADalA
unDunDi vIcETi I gAlilO
onTaraina gunDelO tIgalEni vINalu
mOgutunna mUga rAgamEmO
nidralEni ninnani mElukOni rEpuni
cUputunna nETi rAtirEmO
kanTi cATu sAgarAlu intakAlamEDa dAgenO
anurAga sangamam I kshaNamE
reppadATu uppu nITa ceppalEni tIpi EmiTO
karigincu I kshaNam amRtamE
sumAlu tinchina gatAla mancunE
kshaminci cEruvaina tEne jallidi
cinuku vantenenta cErukundi nIli ningi nElaki
ciguru toDugu taDini telapadA
EDEDu janmAla snEhAlatO
onTaraina gunDelO tIgalEni vINalu
mOgutunna mUga rAgamEmO
nidralEni ninnani mElukOni rEpuni
cUputunna nETi rAtirEmO
vEDi SwAsa vENuvaina nADilOni nAdamEviTO
telavAru vELakai swAgatamE
uDikincu ASalOna bhAshalEni bhAvamEviTO
oDi cEru UsulO sambaramE
tananta tAnugA vasanta vAkiTa
eDAri dAri cEri pUla pUyagA
kalala kOkilamma pADutOndi manasu mAvitOTalO
celimi ciluku Caitra gItika
tiyyangA tEnITi dAhAlatO
onTaraina gunDelO tIgalEni vINalu
mOgutunna mUga rAgamEmO
nidralEni ninnani mElukOni rEpuni
cUputunna nETi rAtirEmO
lala lala lala lala lalala..
Raashi Khanna Glamorous Heroine of South Cinema
-
Raashi Khanna is an Indian actress and model who predominantly works in the
Telugu film industry. She debuted as an actress with the Hindi film Madras
Ca...
No comments:
Post a Comment
Have your say..