Apr 11, 2013

Prapanchame kadanna

ఓ..ఓ..ఓ.. ఓ..ఓ..
ప్రపంచమే కాదన్నా పైనున్నోడే రాకున్నా
నీతో ఉండే దైవం నేస్తం రా
అదృష్టమే లేకున్నా నీ కష్టమే తనదన్నా
నీలో ఉండే ప్రాణం నేస్తం రా
పాపలా నువ్వున్నచో తను కన్నురా
పాదమై నువ్వున్నచో తను మన్నురా
వెలుగుల్లోనే కాదు చీకట్లో నీ నీడరా
ఈ చోటనే కాదు స్వర్గాన నీతోడురా
ఓ..ఓ..ఓ.. ఓ..ఓ..
ప్రపంచమే కాదన్నా పైనున్నోడే రాకున్నా
నీతో ఉండే దైవం నేస్తం రా

త్యాగాలే చేసేది త్యాగాలే అడిగేది
త్యాగంలో బ్రతికేది స్నేహమే
లోపాలే చూసేది అపై సరిచేసేది
లాభాలే చూడనిది స్నేహమే
పంచేకొద్దీ మించిపోయే నిధి తాగేకొద్దీ పొంగిపోయే నది
పంచేకొద్దీ మించిపోయే నిధి తాగేకొద్దీ పొంగిపోయే నది
ఇద్దరికిద్దరు రాజులు ఏలే రాజ్యం స్నేహానిది
యుద్దాలున్నా శాంతిని నిలిపే సైన్యం స్నేహానిది
ఓ..ఓ..ఓ.. ఓ..ఓ..

ప్రపంచమే కాదన్నా పైనున్నోడే రాకున్నా
నీతో ఉండే దైవం నేస్తం రా

విశ్వాసం తొలిమెట్టు విశ్వాసం మలిమెట్టు
విశ్వాసమే చివరంటూ ఉన్నది
ఆకాశం హద్దయినా వినువీధే తనదైనా
ఈ భూమే నెలవంటూ అన్నది
కాలం కన్నా ఇది విలువైనది సత్యం కన్నా ఇది నిజమైనది
కాలం కన్నా ఇది విలువైనది సత్యం కన్నా ఇది నిజమైనది
మనసున దాగిన మనసుని చూపే ఆక్రుతీ స్నేహానిది
మనిషిని పూర్తిగా మనిషినిగా మార్చే సంస్కృతి స్నేహానిది
ఓ..ఓ..ఓ.. ఓ..ఓ..

లాలించగా ఆమ్మల్లే పాలించగా నాన్నాల్లే
లభించిన వరమే నేస్తం రా
ఆడించగా అన్నల్లే భోదించగా గురువల్లే
చెల్లించని రుణమే నేస్తం రా
పాపలా నువ్వున్నచో తను కన్నురా
పాదమై నువ్వున్నచొ తను మన్నురా
వెలుగుల్లోనే కాదు చీకట్లో నీ నీడరా
ఈ చోటనే కాదు స్వర్గాన నీతొడురా
ఓ..ఓ..ఓ.. ఓ..ఓ..
ఓ..ఓ..ఓ.. ఓ..ఓ..




O..O..O.. O..O..
prapaMchamE kAdannA painunnODE rAkunnA
nItO uMDE daivaM nEstaM rA
adRshTamE lEkunnA nI kashTamE tanadannA
nIlO uMDE prANaM nEstaM rA
pApalA nuvvunnachO tanu kannurA
pAdamai nuvvunnachO tanu mannurA
velugullOnE kAdu chIkaTlO nI nIDarA
I chOTanE kAdu swargAna nItODurA
O..O..O.. O..O..
prapaMchamE kAdannA painunnODE rAkunnA
nItO uMDE daivaM nEstaM rA

tyAgAlE chEsEdi tyAgAlE aDigEdi
tyAgaMlO bratikEdi snEhamE
lOpAlE chUsEdi apai sarichEsEdi
lAbhAlE chUDanidi snEhamE
paMchEkoddI miMchipOyE nidhi tAgEkoddI poMgipOyE nadi
paMchEkoddI miMchipOyE nidhi tAgEkoddI poMgipOyE nadi
iddarikiddaru rAjulu ElE rAjyaM snEhAnidi
yuddAlunnA SAMtini nilipE sainyaM snEhAnidi
O..O..O.. O..O..

prapaMchamE kAdannA painunnODE rAkunnA
nItO uMDE daivaM nEstaM rA

viSvAsaM tolimeTTu viSvAsaM malimeTTu
viSwAsamE chivaraMTU unnadi
AkASaM haddayinA vinuvIdhE tanadainA
I bhUmE nelavaMTU annadi
kAlaM kannA idi viluvainadi satyaM kannA idi nijamainadi
kAlaM kannA idi viluvainadi satyaM kannA idi nijamainadi
manasuna dAgina manasuni chUpE AkrutI snEhAnidi
manishini pUrtigA manishinigA mArchE saMskRti snEhAnidi
O..O..O.. O..O..

lAliMchagA AmmallE pAliMchagA nAnnAllE
labhiMchina varamE nEstaM rA
ADiMchagA annallE bhOdiMchagA guruvallE
chelliMchani ruNamE nEstaM rA
pApalA nuvvunnachO tanu kannurA
pAdamai nuvvunnacho tanu mannurA
velugullOnE kAdu chIkaTlO nI nIDarA
I chOTanE kAdu swargAna nItoDurA
O..O..O.. O..O..
O..O..O.. O..O..



No comments:

Post a Comment

Have your say..

My Blog List

Blog Archive