ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ
ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ
ముద్దు మురిపాలలొలొకు ముంగిళ్ళలోన
మూడు పువ్వులు ఆరు కాయల్లు కాయ
ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ...
ఆరనైదోతనము ఏ చోటనుండు
అరుగులలికేవారి అరచేతనుండు
ఆరనైదోతనము ఏ చోటనుండు
అరుగులలికేవారి అరచేతనుండు
తీరైన సంపద ఎవరింటనుండు
తీరైన సంపద ఎవరింటనుండు
దిన దినము ముగ్గున్న లోగిళ్ళనుండు
ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ ఆ..
కోటలో తులిసెమ్మ కొలువున్న తీరు
కోరికొలిచేవారి కొంగుబంగారు
కోటలో తులిసెమ్మ కొలువున్న తీరు
కోరికొలిచేవారి కొంగుబంగారు
గోవుమాలక్ష్మికి కోటి దండాలు
గోవుమాలక్ష్మికి కోటి దండాలు
కోరినంతపాడి నిండు కడవళ్ళు ఆ..
ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ ఆ..
మగడు మెచ్చినచాన కాపురంలోన
మొగలిపూల గాలి ముత్యాల వాన
మగడు మెచ్చినచాన కాపురంలోన
మొగలిపూల గాలి ముత్యాల వాన
ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం
ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం
ఇంటిల్లిపాదికి అంతవైభోగం
ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ
ముద్దు మురిపాలలొలొకు ముంగిళ్ళలోన
మూడు పువ్వులు ఆరు కాయల్లు కాయ
ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ఆ..
ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ
Raashi Khanna Glamorous Heroine of South Cinema
-
Raashi Khanna is an Indian actress and model who predominantly works in the
Telugu film industry. She debuted as an actress with the Hindi film Madras
Ca...
No comments:
Post a Comment
Have your say..