చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో
గతమైన జీవితం కథగానే రాసుకో
మనసైతే మళ్ళీ చదువుకో...ఓ
మరుజన్మకైనా కలుసుకో...ఓ
ఏనాటికేమౌతున్నా ఏ గూడు నీదౌతున్నా
హాయిగానే పాడుతూ
చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో
గతమైన జీవితం కథగానే రాసుకో
జీవితం నీకోసం స్వాగతం పలికిందీఇ
ఆశలే వెలిగించి హారతులు ఇస్తుందీఇ
ఆకాశమంత ఆలయం నీకోసం కట్టుకుంది
కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది
స్నేహం పెంచుకొంటుంది ప్రేమే పంచమంటుంది
కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది
మాసిపోని గాయమల్లే గుండెలోనె ఉంటుంది
చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో
గతమైన జీవితం కథగానే రాసుకో
ఆశయం కావాలి ఆశయం తీరాలి
మనిషిలో దేవున్ని మనసుతో గెలవాలి
అందాల దీవి కానుక అనుబంధం చూసుకో
అనురాగమైన లోకమే నీ సొంతం చేసుకో
లోకం చీకటౌతున్నా బతుకే భారమౌతున్నా
మనసే జ్యోతి కావాలి మనిషే వెలుగు చూపాలి
మరో ప్రపంచ మానవుడిగా ముందు దాటి చూడాలి
చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో
గతమైన జీవితం కథగానే రాసుకో
మనసైతే మళ్ళీ చదువుకో...ఓ
మరుజన్మకైనా కలుసుకో...ఓ
ఏనాటికేమౌతున్నా ఏ గూడు నీదౌతున్నా
హాయిగానే పాడుతూ
చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో
గతమైన జీవితం కథగానే రాసుకో
cinnAri snEhamA cirunAmA tIsukO
gatamaina jIvitam kathagAnE rAsukO
manasaitE maLLI caduvukO...O
marujanmakainA kalusukO...O
EnATikEmoutunnA E gUDu nIdoutunnA
hAyigAnE pADutU
cinnAri snEhamA cirunAmA tIsukO
gatamaina jIvitam kathagAnE rAsukO
jIvitam nIkOsam swAgatam palikindIi
ASalE veliginci hAratulu istundIi
AkASamanta Alayam nIkOsam kaTTukundi
kaLyANa tOraNAlugA nI bratukE mArcutundi
snEham pencukonTundi prEmE pancamanTundi
kAlam karigipOtunTE kalagA cediripOtundi
mAsipOni gAyamallE gunDelOne unTundi
cinnAri snEhamA cirunAmA tIsukO
gatamaina jIvitam kathagAnE rAsukO
ASayam kAvAli ASayam tIrAli
manishilO dEvunni manasutO gelavAli
andAla dIvi kAnuka anubandham cUsukO
anurAgamaina lOkamE nI sontam cEsukO
lOkam cIkaToutunnA batukE bhAramoutunnA
manasE jyOti kAvAli manishE velugu cUpAli
marO prapanca mAnavuDigA mundu dATi cUDAli
cinnAri snEhamA cirunAmA tIsukO
gatamaina jIvitam kathagAnE rAsukO
manasaitE maLLI caduvukO...O
marujanmakainA kalusukO...O
EnATikEmoutunnA E gUDu nIdoutunnA
hAyigAnE pADutU
cinnAri snEhamA cirunAmA tIsukO
gatamaina jIvitam kathagAnE rAsukO
Importance of Kukke Subramanya
-
Lapped in the luxurious abundance of the beauty of the nature the village
of Subramanya lies in the Sullia Taluk in Dakshina Kannada with a sancity
which v...
No comments:
Post a Comment
Have your say..