Showing posts with label Villain. Show all posts
Showing posts with label Villain. Show all posts

Apr 1, 2013

Naa gunde gudilo

నా గుండె గుడిలో నువ్వు శిలవా దేవతవా
నా వలపు బడిలో నువ్వు గురువా శిష్యుడివా
నా గుండె గుడిలో నువ్వు శిలవా దేవతవా
నా వలపు బడిలో నువ్వు గురువా శిష్యుడివా
నీ కనుల ఒడిలో నే కలనా కాటుకనా
ఆ..నీ పెదవి తడిలో నే ముద్దునా మధురిమనా
ఆ..నీ సొగసు పొగడ నే కవినా కల్పననా
నా గుండె గుడిలో నువ్వు శిలవా దేవతవా
నా వలపు బడిలో నువ్వు గురువా శిష్యుడివా

నే బిడియపడితే నువ్వు గిలివా చెక్కిలివా
ఆ..నే విరహమైతే నువ్వు రతివా కోరికవా
ఆ..నే పాపనైతే నువ్వు ఒడివా ఊయలవా
ఆ..హా..నే నిదురనైతే నువ్వు కలవా కౌగిళివా
ఆ..నే హృదయమైతే ఊపిరివా సవ్వడివా

ఆ..హా..నా గుండె గుడిలో నువ్వు శిలవా దేవతవా
నా వలపు బడిలో నువ్వు గురువా శిష్యుడివా

నే గగనమైతే వేసవివా వెన్నెలవా
ఆ..నే నదిని అయితే నువ్వు అలవా అలజడివా
ఆ..నే విందునైతే నువ్వు రుచివా ఆకలివా
ఆ..హా..నే భాషనైతే నువ్వు స్వరమా అక్షరమా
ఆ..నే పాటనైతే నువ్వు శృతివా పల్లవివా..నే

నే తోటనైతే ఆమనివా కోయిలవా
నా జంటకొస్తే నువ్వు ఋషివా మదనుడివా
నీ ఎదుట పడితే పిలిచేవా వలచేవా
ఆ..నిను నేను పిలవకుంటే నువ్వు అలగవా అడగవా
ఆ..నను ప్రేమించమంటే తప్పా ఒప్పా

నీలోన ఉంది నేనే కదా - నేనే కదా
నాలోన ఉంది నీవే కదా - నీవే కదా
ఎదలోని వలపే ఎదురెదురు చూసె
వానలాగా ఒడి చేరెలే




nA gunDe guDilO nuvvu SilavA dEvatavA
nA valapu baDilO nuvvu guruvA SishyuDivA
nA gunDe guDilO nuvvu SilavA dEvatavA
nA valapu baDilO nuvvu guruvA SishyuDivA
nI kanula oDilO nE kalanA kATukanA
A..nI pedavi taDilO nE muddunA madhurimanA
A..nI sogasu pogaDa nE kavinA kalpananA
nA gunDe guDilO nuvvu SilavA dEvatavA
nA valapu baDilO nuvvu guruvA SishyuDivA

nE biDiyapaDitE nuvvu gilivA cekkilivA
A..nE virahamaitE nuvvu rativA kOrikavA
A..nE pApanaitE nuvvu oDivA UyalavA
A..hA..nE niduranaitE nuvvu kalavA kougiLivA
A..nE hRdayamaitE UpirivA savvaDivA

A..hA..nA gunDe guDilO nuvvu SilavA dEvatavA
nA valapu baDilO nuvvu guruvA SishyuDivA

nE gaganamaitE vEsavivA vennelavA
A..nE nadini ayitE nuvvu alavA alajaDivA
A..nE vindunaitE nuvvu ruchivA AkalivA
A..hA..nE bhAshanaitE nuvvu swaramA aksharamA
A..nE pATanaitE nuvvu SRtivA pallavivA..nE

nE tOTanaitE AmanivA kOyilavA
nA janTakostE nuvvu RshivA madanuDivA
nI eduTa paDitE pilicEvA valacEvA
A..ninu nEnu pilavakunTE nuvvu alagavA aDagavA
A..nanu prEmincamanTE tappA oppA

nIlOna undi nEnE kadA - nEnE kadA
nAlOna undi nIvE kadA - nIvE kadA
edalOni valapE edureduru cUse
vAnalAgA oDi cErelE



Chinnari Navvulaki

చిన్నారి నవ్వులకి రాములోరి రక్ష అని
రాగమెట్టి పాడవే రామ చిలక
కన్నీళ్ళు రాలవని కష్టమింక రాదు అని
చెంత చేరి చెప్పవే చిట్టి చిలక
ఎగిసే మనసే ఒక పాట
చెలిమై నడిచే కడదాకా
చిన్నారి నవ్వులకి రాములోరి రక్ష అని
రాగమెట్టి పాడవే రామ చిలక
కన్నీళ్ళు రాలవని కష్టమింక రాదు అని
చెంత చేరి చెప్పవే చిట్టి చిలక




cinnAri navvulaki rAmulOri raksha ani
rAgameTTi pADavE rAma cilaka
kannILLu rAlavani kashTaminka rAdu ani
centa cEri ceppavE ciTTi cilaka
egisE manasE oka pATa
celimai naDicE kaDadAkA
cinnAri navvulaki rAmulOri raksha ani
rAgameTTi pADavE rAma cilaka
kannILLu rAlavani kashTaminka rAdu ani
centa cEri ceppavE ciTTi cilaka



Ee padu gudodili

ఈ పాడు గూడొదిలి పారిపో పసి చిలక
బంధమన్న మాటసలే లేదు గనక
నీ నీడ నిన్నొదిలి పోదులే భయపడక
అండగా అడుగడుగూ ఉంది గనక
మనసూ మమత మరిచాక
ఎవరూ వినరే ఎద కేక
ఈ పాడు గూడొదిలి పారిపో పసి చిలక
బంధమన్న మాటసలే లేదు గనక
నీ నీడ నిన్నొదిలి పోదులే భయపడక
అండగా అడుగడుగూ ఉంది గనక




I pADu gUDodili pAripO pasi cilaka
bandhamanna mATasalE lEdu ganaka
nI nIDa ninnodili pOdulE bhayapaDaka
anDagA aDugaDugU undi ganaka
manasU mamata maricAka
evarU vinarE eda kEka
I pADu gUDodili pAripO pasi cilaka
bandhamanna mATasalE lEdu ganaka
nI nIDa ninnodili pOdulE bhayapaDaka
anDagA aDugaDugU undi ganaka



Panchadara chilaka

పంచదార చిలకా పలుకు ఏదిష్టం
కంచి పట్టు రవికా అడుగు నీ ఇష్టం
ఓర కన్ను గీటే పిలుపే నాకిష్టం
దోర పండు లాంటి వలపే నాకిష్టం
కొమ్మల్లో కోయిల రాగం పువ్వింట్లో తుమ్మెద మంత్రం
సందిట్లో చలి సాయంత్రం ఏది నీకిష్టం
ప్రేమల్లో తొలి పేరంటం పెదవుల్లో తడి ఆరాటం
కౌగిట్లో చిట్లే గాజుల గోలే నాకిష్టం
పంచదార చిలకా పలుకు ఏదిష్టం
కంచి పట్టు రవికా అడుగు నీ ఇష్టం

మంచులు కమ్మిన మార్గశిరం కంబళి చాటున ఏదిష్టం
ఓ..చక్కిలిగింతల కొంటెతనం చాటున వలపే నాకిష్టం
చెమటే అభిషేకం చేసి చెలిమే నైవేద్యం పెట్టి
తీర్థంగా నేనేదిస్తే నీకు ఇష్టం
హా..మనసే వెన్నెలతో కొలిచి సొగసే మంచెంగా పరిచి
హాయే హారతిగా ఇస్తే నాకు ఇష్టం
నవ్వంటి నువ్వంటే నాకెంతో ఇష్టం

హే పంచదార చిలకా పలుకు ఏదిష్టం
కంచి పట్టు రవికా అడుగు నీ ఇష్టం
ఓర కన్ను గీటే పిలుపే నాకిష్టం
దోర పండు లాంటి వలపే నాకిష్టం

జలకాలాటల సరిగమలో జత కలిసేందుకు ఎవరిష్టం
ఓహోహోహో..తెల్లని కోకను కట్టగనే మల్లెలు తెచ్చిన నువ్విష్టం
వచ్చి తుమ్మెదలా నిన్ను వాలి నీ ఎదలో తేనె
లాగే సాయంత్రం పూట ఏదిష్టం
అట్టే ఎంగిళ్ళలోన పట్టే కౌగిళ్ళలోన
గిచ్చి పాడేటి జోల నాకు ఇష్టం
నా వెంటే నువ్వుంటే నాకెంతొ ఇష్టం

హే పంచదార చిలకా పలుకు ఏదిష్టం
కంచి పట్టు రవికా అడుగు నీ ఇష్టం
ఓర కన్ను గీటే పిలుపే నాకిష్టం
దోర పండు లాంటి వలపే నాకిష్టం
కొమ్మల్లో కోయిల రాగం పువ్వింట్లో తుమ్మెద మంత్రం
సందిట్లో చలి సాయంత్రం ఏది నీకిష్టం
ప్రేమల్లో తొలి పేరంటం పెదవుల్లో తడి ఆరాటం
కౌగిట్లో చిట్లే గాజుల గోలే నాకిష్టం




pancadAra cilakA paluku EdishTam
kanci paTTu ravikA aDugu nI ishTam
Ora kannu gITE pilupE nAkishTam
dOra panDu lAnTi valapE nAkishTam
kommallO kOyila rAgam puvvinTlO tummeda mantram
sandiTlO cali sAyantram Edi nIkishTam
prEmallO toli pEranTam pedavullO taDi ArATam
kougiTlO ciTlE gAjula gOlE nAkishTam
pancadAra cilakA paluku EdishTam
kanci paTTu ravikA aDugu nI ishTam

manculu kammina mArgaSiram kambaLi cATuna EdishTam
O..cakkiligintala konTetanam cATuna valapE nAkishTam
cemaTE abhishEkam cEsi celimE naivEdyam peTTi
tIrthangA nEnEdistE nIku ishTam
hA..manasE vennelatO kolici sogasE mancengA parici
hAyE hAratigA istE nAku ishTam
navvanTi nuvvanTE nAkentO ishTam

hE pancadAra cilakA paluku EdishTam
kanci paTTu ravikA aDugu nI ishTam
Ora kannu gITE pilupE nAkishTam
dOra panDu lAnTi valapE nAkishTam

jalakAlATala sarigamalO jata kalisEnduku evarishTam
OhOhOhO..tellani kOkanu kaTTaganE mallelu teccina nuvvishTam
vacci tummedalA ninnu vAli nI edalO tEne
lAgE sAyantram pUTa EdishTam
aTTE engiLLalOna paTTE kougiLLalOna
gicci pADETi jOla nAku ishTam
nA venTE nuvvunTE nAkento ishTam

hE pancadAra cilakA paluku EdishTam
kanci paTTu ravikA aDugu nI ishTam
Ora kannu gITE pilupE nAkishTam
dOra panDu lAnTi valapE nAkishTam
kommallO kOyila rAgam puvvinTlO tummeda mantram
sandiTlO cali sAyantram Edi nIkishTam
prEmallO toli pEranTam pedavullO taDi ArATam
kougiTlO ciTlE gAjula gOlE nAkishTam



My Blog List

Blog Archive