Showing posts with label Pooja Phalam. Show all posts
Showing posts with label Pooja Phalam. Show all posts

Mar 18, 2013

Pagale vennela

పగలే వెన్నెల జగమే ఊయల
కదలే ఊహలకే కన్నులుంటే..
పగలే వెన్నెల జగమే ఊయల

నింగిలోన చందమామ తొంగి చూచె
నీటిలోన కలువభామ పొంగి పూచె..
ఈ అనురాగమే జీవనరాగమై
ఈ అనురాగమే జీవనరాగమై
ఎదలో తేనెజల్లు కురిసిపోదా

పగలే వెన్నెల జగమే ఊయల

కడలి పిలువ కన్నెవాగు పరుగుతీసె
మురళి పాట విన్న నాగు శిరసునూపె
ఈ అనుబంధమే మధురానందమై
ఈ అనుబంధమే మధురానందమై
ఇలపై నందనాలు నిలిపి పోదా

పగలే వెన్నెల జగమే ఊయల

నీలిమబ్బు నీడలేచి నెమలి ఆడె
పూల ఋతువు సైగచూచి పిఖము పాడె
నీలిమబ్బు నీడలేచి నెమలి ఆడె
పూల ఋతువు సైగచూచి పిఖము పాడె
మనసే వీణగా ఝనఝన మ్రొయగా
బ్రతుకే పున్నమిగా విరిసిపోదా

పగలే వెన్నెల జగమే ఊయల
కదలే ఊహలకే కన్నులుంటే..
పగలే వెన్నెల




pagalE vennela jagamE Uyala
kadalE UhalakE kannuluMTE..
pagalE vennela jagamE Uyala

niMgilOna chaMdamAma toMgi chUche
nITilOna kaluvabhAma poMgi pUche..
I anurAgamE jIvanarAgamai
I anurAgamE jIvanarAgamai
edalO tEnejallu kurisipOdA

pagalE vennela jagamE Uyala

kaDali piluva kannevAgu parugutIse
muraLi pATa vinna nAgu SirasunUpe
I anubaMdhamE madhurAnaMdamai
I anubaMdhamE madhurAnaMdamai
ilapai naMdanAlu nilipi pOdA

pagalE vennela jagamE Uyala

nIlimabbu nIDalEchi nemali ADe
pUla Rtuvu saigachUchi pikhamu pADe
nIlimabbu nIDalEchi nemali ADe
pUla Rtuvu saigachUchi pikhamu pADe
manasE vINagA jhanajhana mroyagA
bratukE punnamigA virisipOdA

pagalE vennela jagamE Uyala
kadalE UhalakE kannuluMTE..
pagalE vennela



Ninnaleni andamedo

నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో
నిదురలేచెనెందుకో
తెలియరాని రాగమేదో తీగసాగెనెందుకో
తీగసాగెనెందుకో
నాలో నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో
నిదురలేచెనెందుకో

పూచిన ప్రతి తరువొక వధువు
పువ్వు పువ్వున పొంగెను మధువు
ఇన్నాళ్ళీ శోభలన్నీ ఎచట దాగెనో..ఓ..
నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో
నిదురలేచెనెందుకో

చెలినురుగులే నవ్వులు కాగా
సెలయేరులు కులుకుచూ రాగా
కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే..
నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో
నిదురలేచెనెందుకో

పసిడి అంచు పైట జార..ఆ..ఓ..ఓ..
పసిడి అంచు పైట జార పయనించే మేఘబాల
అరుణకాంతి సోకగానే పరవశించెనే
నిన్న లేని అందమేదో నిదురలేచెనెందుకో
నిదురలేచెనెందుకో




ninna lEni aMdamEdO niduralEcheneMdukO
niduralEcheneMdukO
teliyarAni rAgamEdO tIgasAgeneMdukO
tIgasAgeneMdukO
nAlO ninna lEni aMdamEdO niduralEcheneMdukO
niduralEcheneMdukO

pUchina prati taruvoka vadhuvu
puvvu puvvuna poMgenu madhuvu
innALLI SObhalannI echaTa dAgenO..O..
ninna lEni aMdamEdO niduralEcheneMdukO
niduralEcheneMdukO

chelinurugulE navvulu kAgA
selayErulu kulukuchU rAgA
kanipiMchani vINalEvO kadali mrOgenE..
ninna lEni aMdamEdO niduralEcheneMdukO
niduralEcheneMdukO

pasiDi aMchu paiTa jAra..A..O..O..
pasiDi aMchu paiTa jAra payaniMchE mEghabAla
aruNakAMti sOkagAnE paravaSiMchenE
ninna lEni aMdamEdO niduralEcheneMdukO
niduralEcheneMdukO



Andena ee chetula

సుందర సుర నందన వనమల్లి జాబిల్లి
అందేనా ఈ చేతులకందేనా
అందేనా ఈ చేతులకందేనా
చందమామ ఈ కనులకు విందేనా
అందేనా ఈ చేతులకందేనా

ఆ మడుగున కనిపించి నా మనసున నివశించి
అంతలోనే ఆకాశపు అంచుల విహరించె
చందమామ ఈ కనులకు విందేనా

తలపు దాటనీక మనసు తలుపు వేయగలను గాని
నింగి పైకి ఆశలనే నిచ్చెనేయగలను గాని
కొలనులోన కోర్కెలనే అలలపైన ఊగె
కలువ పేద బ్రతుకులోన వలపు తేనె నింపేనా
చందమామ ఈ కనులకు విందేనా




sundara sura nandana vanamalli jAbilli
andEnA I cEtulakandEnA
andEnA I cEtulakandEnA
candamAma I kanulaku vindEnA
andEnA I cEtulakandEnA

A maDuguna kanipinci nA manasuna nivaSinci
antalOnE AkASapu ancula viharince
candamAma I kanulaku vindEnA

talapu dATanIka manasu talupu vEyagalanu gAni
ningi paiki ASalanE niccenEyagalanu gAni
kolanulOna kOrkelanE alalapaina Uge
kaluva pEda bratukulOna valapu tEne nimpEnA
candamAma I kanulaku vindEnA



Madana manasayera

ఓ..ఓ..ఓ..మదనా మనసాయెరా
పరువము పొంగే తరుణము నేడే
మరి మరి నీకై రాబోదురా
మదనా మనసాయెరా

ఆ..ఆ.. సుందరి మధువై ముందు నిలిచెరా
నీ.. ముందు నిలిచెరా..ఆ..
అందిన పెన్నిధి అనుభవించరా..ఆ..
కలువను మీరే చెలువను చేరె
కలువను మీరే చెలువను చేరె
వలపును తూచే వేళయెరా

మదనా మనసాయెరా
పరువము పొంగే తరుణము నేడే
మరి మరి నీకై రాబోదురా
మదనా మనసాయెరా




O..O..O..madanA manasAyerA
paruvamu pongE taruNamu nEDE
mari mari nIkai rAbOdurA
madanA manasAyerA

A..A.. sundari madhuvai mundu nilicerA
nI.. mundu nilicerA..A..
andina pennidhi anubhavincarA..A..
kaluvanu mIrE celuvanu cEre
kaluvanu mIrE celuvanu cEre
valapunu tUcE vELayerA

madanA manasAyerA
paruvamu pongE taruNamu nEDE
mari mari nIkai rAbOdurA
madanA manasAyerA



Sivadiksha paruralanura

శివ దీక్షా పరురాలనురా
నే శివ దీక్షా పరురాలనురా
శీలమెంతైనా విడువ జాలనురా
నే శీలమెంతైనా విడువ జాలనురా
నే శీలమెంతైనా విడువ జాలనురా
నే శివ దీక్షా పరురాలనురా

శివ శివ గురునాజ్ఞ మీరనురా
శివ శివ గురునాజ్ఞ మీరనురా
శ్రీ వైష్ణవుడంటే చేరనురా
నే.. శ్రీ వైష్ణవుడంటే చేరనురా
నే నే శివ దీక్షా పరురాలనురా

వడిగా వచ్చి మరము చొరవకురా
వడిగా వచ్చి మరము చొరవకురా
శివార్చన వేళ తలుపు తెరవకురా
శివార్చన వేళ నా మడుగు తావి చెరగు తీయకురా
మడుగు తావి చెరగు తీయకురా
మాటి మాటికీ నోరు మూయకురా
తా మాటి మాటికీ నోరు మూయకురా

శివ దీక్షా పరురాలనురా




Siva dIkshA parurAlanurA
nE Siva dIkshA parurAlanurA
SIlamentainA viDuva jAlanurA
nE SIlamentainA viDuva jAlanurA
nE SIlamentainA viDuva jAlanurA
nE Siva dIkshA parurAlanurA

Siva Siva gurunAj~na mIranurA
Siva Siva gurunAj~na mIranurA
SrI vaishNavuDanTE cEranurA
nE.. SrI vaishNavuDanTE cEranurA
nE nE Siva dIkshA parurAlanurA

vaDigA vacci maramu coravakurA
vaDigA vacci maramu coravakurA
SivArcana vELa talupu teravakurA
SivArcana vELa nA maDugu tAvi ceragu tIyakurA
maDugu tAvi ceragu tIyakurA
mATi mATikI nOru mUyakurA
tA mATi mATikI nOru mUyakurA

Siva dIkshA parurAlanurA



Vastavu potaavu

వస్తావు పోతావు నా కోసం
వచ్చి కూర్చున్నాడు నీ కోసం
యముడు వచ్చి కూర్చున్నాడు నీ కోసం

పొరపాటు పడి చేత దొరికిపోయావంటే నా బంగారు చేపా
డొక్క చీలుస్తాడు దోలు కట్టిస్తాడు

వస్తావు పోతావు నా కోసం
వచ్చి కూర్చున్నాడు నీ కోసం
యముడు వచ్చి కూర్చున్నాడు నీ కోసం

నిక్కి నిక్కి పైకి చూశేవు
తళుకు బెళుకు చూసి మురిసేవు
కదలలేడనిపించి కలలు కన్నావంటే
కదలలేడనిపించి కలలు కన్నావంటే
బొక్క ముక్కలు చేసి తిక్క వదిలిస్తాడు

వస్తావు పోతావు నా కోసం
వచ్చి కూర్చున్నాడు నీ కోసం
యముడు వచ్చి కూర్చున్నాడు నీ కోసం




vastAvu pOtAvu nA kOsam
vacci kUrcunnADu nI kOsam
yamuDu vacci kUrcunnADu nI kOsam

porapATu paDi cEta dorikipOyAvanTE nA bangAru cEpA
Dokka cIlustADu dOlu kaTTistADu

vastAvu pOtAvu nA kOsam
vacci kUrcunnADu nI kOsam
yamuDu vacci kUrcunnADu nI kOsam

nikki nikki paiki cUSEvu
taLuku beLuku cUsi murisEvu
kadalalEDanipinci kalalu kannAvanTE
kadalalEDanipinci kalalu kannAvanTE
bokka mukkalu cEsi tikka vadilistADu

vastAvu pOtAvu nA kOsam
vacci kUrcunnADu nI kOsam
yamuDu vacci kUrcunnADu nI kOsam



Tharatharamugaa

తరతరమ్ములుగా దాన ధర్మములకు
కల్ప తరువుగా విలసిల్లి
కలలకెన్నో చలువ పందిళ్ళు వేసి
సంస్కారమునకు సభ్యతకు
దీపమెడిన వంశమ్ము నేడు
కావగా రావా నీవైనా దేవ దేవా




taratarammulugA dAna dharmamulaku
kalpa taruvugA vilasilli
kalalakennO caluva pandiLLu vEsi
samskAramunaku sabhyataku
dIpameDina vamSammu nEDu
kAvagA rAvA nIvainA dEva dEvA



My Blog List

Blog Archive