Showing posts with label Money. Show all posts
Showing posts with label Money. Show all posts

Apr 11, 2013

Chakravarthiki veedhi

చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ
బంధువౌతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టమూ కాదు అయ్య చుట్టమూ కాదు
అయినా అన్నీ అంది మనీ మనీ
పచ్చనోటుతో లైఫు లక్ష లింకులు
పెట్టుకుంటుందని అంది మనీ మనీ
పుట్టడానికీ పాడె కట్టడానికి మధ్య
అంతా తనే అంది మనీ మనీ
కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మనీ
తైలం తమాషా చూద్దాం పదండి అంది మనీ మనీ
డబ్బుని లబ్ డబ్బని గుండెల్లో పెట్టుకోరా
దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా
చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ
బంధువౌతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టమూ కాదు అయ్య చుట్టమూ కాదు
అయినా అన్నీ అంది మనీ మనీ

ఇంటద్దె కట్టావా నా తండ్రీ నో ఎంట్రీ వీధి వాకిట్లో
దొంగల్లే దూరాలి సైలెంట్లీ నీ ఇంట్లో చిమ్మ చీకట్లో
అందుకే పదా బ్రదర్ మనీ వేటకి
అప్పుకే పదా బ్రదర్ ప్రతీ పూటకి
రోటీ కపడా రూము అన్నీ రూపీ రూపాలే
సొమ్ముని శరణమ్మని చరణమ్ము నమ్ముకోరా
దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా

చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ
బంధువౌతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టమూ కాదు అయ్య చుట్టమూ కాదు
అయినా అన్నీ అంది మనీ మనీ

ప్రేమించుకోవచ్చు దర్జాగా పిక్చర్లో పేద హీరోలా
డ్రీమించుకోవచ్చు ధీమాగా డ్రామాలో ప్రేమ స్టోరీలా
పార్కులో కనే కలే ఖరీదైనది
బ్లాకులో కొనే వెలే సినీ ప్రేమది
చూపించరుగా ఫ్రీషో వేసి ప్రేమికులెవ్వరికీ
జీవితం ప్రతి నిమిషమూ సొమ్మిచ్చి పుచ్చుకోరా
దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా

చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ
బంధువౌతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టమూ కాదు అయ్య చుట్టమూ కాదు
అయినా అన్నీ అంది మనీ మనీ
కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మనీ
తైలం తమాషా చూద్దాం పదండి అంది మనీ మనీ
డబ్బుని లబ్ డబ్బని గుండెల్లో పెట్టుకోరా
దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా
అ. డబ్బురా డబ్బు డబ్బురా
డబ్బు డబ్బే డబ్బు డబ్బురా




chakravartikI vIdhi bichchagattekI
baMdhuvautAnani aMdi manI manI
amma chuTTamU kAdu ayya chuTTamU kAdu
ayinA annI aMdi manI manI
pachchanOTutO laiphu laksha liMkulu
peTTukuMTuMdani aMdi manI manI
puTTaDAnikI pADe kaTTaDAniki madhya
aMtA tanE aMdi manI manI
kAlaM kharIdu chEddAM padaMDi aMdi manI manI
tailaM tamAshA chUddAM padaMDi aMdi manI manI
Dabbuni lab Dabbani guMDellO peTTukOrA
dIkshagA dhanalakshmini lavvADi kaTTukOrA
chakravartikI vIdhi bichchagattekI
baMdhuvautAnani aMdi manI manI
amma chuTTamU kAdu ayya chuTTamU kAdu
ayinA annI aMdi manI manI

iMTadde kaTTAvA nA taMDrI nO eMTrI vIdhi vAkiTlO
doMgallE dUrAli saileMTlI nI iMTlO chimma chIkaTlO
aMdukE padA bradar manI vETaki
appukE padA bradar pratI pUTaki
rOTI kapaDA rUmu annI rUpI rUpAlE
sommuni SaraNammani charaNammu nammukOrA
dIkshagA dhanalakshmini lavvADi kaTTukOrA

chakravartikI vIdhi bichchagattekI
baMdhuvautAnani aMdi manI manI
amma chuTTamU kAdu ayya chuTTamU kAdu
ayinA annI aMdi manI manI

prEmiMchukOvachchu darjAgA pikcharlO pEda hIrOlA
DrImiMchukOvachchu dhImAgA DrAmAlO prEma sTOrIlA
pArkulO kanE kalE kharIdainadi
blAkulO konE velE sinI prEmadi
chUpiMcharugA frIshO vEsi prEmikulevvarikI
jIvitaM prati nimishamU sommichchi puchchukOrA
dIkshagA dhanalakshmini lavvADi kaTTukOrA

chakravartikI vIdhi bichchagattekI
baMdhuvautAnani aMdi manI manI
amma chuTTamU kAdu ayya chuTTamU kAdu
ayinA annI aMdi manI manI
kAlaM kharIdu chEddAM padaMDi aMdi manI manI
tailaM tamAshA chUddAM padaMDi aMdi manI manI
Dabbuni lab Dabbani guMDellO peTTukOrA
dIkshagA dhanalakshmini lavvADi kaTTukOrA
a. DabburA Dabbu DabburA
Dabbu DabbE Dabbu DabburA



Badram be careful

భద్రం be careful బ్రదరూ భర్తగా మారకు బ్యాచిలరు
షాదీ మాటే వద్దు గురూ సోలో బ్రతుకే సో బెటరూ
భద్రం be careful బ్రదరూ భర్తగా మారకు బ్యాచిలరు
షాదీ మాటే వద్దు గురూ సోలో బ్రతుకే సో బెటరూ
ఆలికి మెళ్ళో ముళ్ళేశానని ఆనందించే మగవారు
ఆ తాడే తమ ఉరితాడన్నది ఆలోచించక చెడతారు
మొగుడయ్యే ముహూర్తమే మగాడి సుఖాల ముగింపు ఛాప్టరు
భద్రం be careful బ్రదరూ భర్తగా మారకు బ్యాచిలరు
షాదీ మాటే వద్దు గురూ సోలో బ్రతుకే సో బెటరూ

వంటకని వైఫెందుకురా హోటళ్ళే చాలు
ఒంటికని ఒకటా రెండా అంగడి అందాలు
కోతికి ఉందా కోడికి ఉందా ఈ పెళ్ళాచారం
జంటలు కట్టే జంతువులెరగవు వెడ్డింగ్ విడ్డూరం
ఎందుకు మనకీ గ్రహచారం

భద్రం be careful బ్రదరూ భర్తగా మారకు బ్యాచిలరు
షాదీ మాటే వద్దే వద్దు గురూ సోలో బ్రతుకే సో బెటరూ

చచ్చి చెడి డే అండ్ నైటు చాకిరి చేస్తావు
తెచ్చినది డార్లింగ్ దెయ్యం చేతిలో పోస్తావు
బీడీ కోసం బీబీ ముందు దేహీ అంటావు
గాడిని దాటని గానుగ ఎద్దై బతికేం చేస్తావు
బాండేడ్ బానిసవౌతావు

పులి లాగే పెళ్ళికి కూడా లెటర్స్ రెండేరా
పర్వాలేదని పక్కకు వెడితే ఫలారమైపోరా
ఈది అమీను సదాం హుస్సేను హిట్లర్ ఎట్సెట్రా
ఇంట్లో వున్నా పెళ్ళం కన్నా డిక్టేటర్లట్రా
అంతటి డిక్టేటర్లట్రా

భద్రం be careful బ్రదరూ భర్తగా మారకు బ్యాచిలరు
షాదీ మాటే వద్దమ్మా వద్దు గురూ సోలో బ్రతుకే సో బెటరూ




bhadraM be careful bradarU bhartagA mAraku byAchilaru
shAdI mATE vaddu gurU sOlO bratukE sO beTarU
bhadraM be careful bradarU bhartagA mAraku byAchilaru
shAdI mATE vaddu gurU sOlO bratukE sO beTarU
Aliki meLLO muLLESAnani AnaMdiMchE magavAru
A tADE tama uritADannadi AlOchiMchaka cheDatAru
moguDayyE muhUrtamE magADi sukhAla mugiMpu ChApTaru
bhadraM be careful bradarU bhartagA mAraku byAchilaru
shAdI mATE vaddu gurU sOlO bratukE sO beTarU

vaMTakani waifeMdukurA hOTaLLE chAlu
oMTikani okaTA reMDA aMgaDi aMdAlu
kOtiki uMdA kODiki uMdA I peLLAchAraM
jaMTalu kaTTE jaMtuvuleragavu veDDiMg viDDUraM
eMduku manakI grahachAraM

bhadraM be careful bradarU bhartagA mAraku byAchilaru
shAdI mATE vaddE vaddu gurU sOlO bratukE sO beTarU

chachchi cheDi DE aMD naiTu chAkiri chEstAvu
techchinadi DArliMg deyyaM chEtilO pOstAvu
bIDI kOsaM bIbI muMdu dEhI aMTAvu
gADini dATani gAnuga eddai batikEM chEstAvu
bAMDED bAnisavautAvu

puli lAgE peLLiki kUDA leTars reMDErA
parvAlEdani pakkaku veDitE phalAramaipOrA
Idi amInu sadAM hussEnu hiTlar eTseTrA
iMTlO vunnA peLLaM kannA DikTETarlaTrA
aMtaTi DikTETarlaTrA

bhadraM be careful bradarU bhartagA mAraku byAchilaru
shAdI mATE vaddammA vaddu gurU sOlO bratukE sO beTarU



Anaganaga anane ledinka

అనగనగనగనగా అననే లేదింకా
అపుడే అదా కథ అంటే ఎట్టాగా

అనగనగనగనగా అననే లేదింకా
అపుడే అదా కథ అంటే ఎట్టాగా
అనగనగనగనగా అననే లేదింకా
అపుడే అదా కథ అంటే ఎట్టాగా
టైటిల్స్ అవగానే వేసిన శుభం కార్డులాగ
హర్టీ కంగ్రాట్స్ ఆంటీ అనక యాంటీ క్లైమాక్స్ లాగా
చాలా చాలా జరగాలింకా జనగనమన దాకా కనక
అనగనగనగనగా అననే లేదింకా
అపుడే అదా కథ అంటే ఎట్టాగా

కాగల కార్యం కానివ్వండి గంధర్వుల్లాగ
మన సుబ్బారావు అంకుల్ గారికి వంకర తీయంగా
ఎయ్ ఏంటి ఆణ్ణంకుల్ అనేది
ఓకే బాబి తోబా తోబా మాఫ్ కీజియెగా మే ఖాన్ పకడ్లొంగీ
దట్స్ గుడ్
హిందీ బాబి ఇంగ్లీష్ ఆంటీ ఒకటే మీనింగా
రిలేషన్ లైను మారిపోదా
ఏదో పాపం బేబిలే అని వదిలెయచ్చునుగా
గ్రామర్ ప్రైవేట్ కోచింగా

అనగనగనగనగా అననే లేదింకా
అపుడే అదా కథ అంటే ఎట్టాగా
అనగనగనగనగా అననే లేదింకా
అపుడే అదా కథ అంటే ఎట్టాగా

డీలిక్షాయర డింబకా డియర్ దీవిస్తున్నాగా
తప్పమ్మా పాతాళ భైరవి వుడ్ బీ మొగుడేగా
ఏమండోయ్ మా పిల్ల పెళ్లికి మీ పెత్తనమేంటి పెంకితనంగా
విడాకులు కట్నాలు మొదలగు వేడుకలున్నాయిగా
అలాంటి ముచ్చట్లన్ని మావేగా
పెళ్లికి ముందే పెటాకులనురా ఫ్రెండు పీనుగా రేయ్
శుభం పలికేది ఇట్టాగా
క్రైం పనిష్మెంట్ కిస్సా కాస్తా కలర్ మార్చుకుందాం
రొమాంటిక్ రూటు పట్టుకుందాం

అనగనగనగనగా అననే లేదింకా
అపుడే అదా కథ అంటే ఎట్టాగా
లల లల ల...




anaganaganaganagA ananE lEdiMkA
apuDE adA katha aMTE eTTAgA

anaganaganaganagA ananE lEdiMkA
apuDE adA katha aMTE eTTAgA
anaganaganaganagA ananE lEdiMkA
apuDE adA katha aMTE eTTAgA
TaiTils avagAnE vEsina SubhaM kArDulAga
harTI kaMgrATs AMTI anaka yAMTI klaimAks lAgA
chAlA chAlA jaragAliMkA janaganamana dAkA kanaka
anaganaganaganagA ananE lEdiMkA
apuDE adA katha aMTE eTTAgA

kAgala kAryaM kAnivvaMDi gaMdharvullAga
mana subbArAvu aMkul gAriki vaMkara tIyaMgA
ey EMTi ANNankul anEdi
OkE bAbi tObA tObA mAph kIjiyegA mE khAn pakaDloMgI
daTs guD
hiMdI bAbi iMglIsh AMTI okaTE mIniMgA
rilEshan lainu mAripOdA
EdO pApaM bEbilE ani vadileyaccunugA
grAmar praivET kOchiMgA

anaganaganaganagA ananE lEdiMkA
apuDE adA katha aMTE eTTAgA
anaganaganaganagA ananE lEdiMkA
apuDE adA katha aMTE eTTAgA

DIlikshAyara DiMbakA Diyar dIvistunnAgA
tappammA pAtALa bhairavi wuD bI moguDEgA
EmaMDOy mA pilla peLliki mI pettanamEMTi peMkitanaMgA
viDAkulu kaTnAlu modalagu vEDukalunnAyigA
alAMTi muchchaTlanni mAvEgA
peLliki muMdE peTAkulanurA phreMDu pInugA rEy
SubhaM palikEdi iTTAgA
kraiM panishmeMT kissA kAstA kalar mArchukuMdAM
romAMTik rUTu paTTukuMdAM

anaganaganaganagA ananE lEdiMkA
apuDE adA katha aMTE eTTAgA
lala lala la...



Vareva emi facu

వారెవా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు
వచ్చింది సినిమా ఛాన్సు ఇంక వేసెయ్యి మరో డోసు
వారెవా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు
వచ్చింది సినిమా ఛాన్సు ఇంక వేసెయ్యి మరో డోసు
పిచ్చెక్కి ఆడియన్సు రెచ్చిపోయేలా చెయ్యి డాన్సు
చెప్పింది చెయ్యరా నీవేరా ముందు డేసు
వారెవా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు

అమితాబచ్చను కన్నా ఏం తక్కువ నువ్వైనా
హాలివుడ్లో అయినా ఎవరెక్కువ నీ కన్నా
ఫైటు ఫీటు ఆట పాట రావా నీకైనా
చిరంజీవైనా పుడుతూనే మెగాస్టార్ అయిపోలేదయ్యా
తెగించే సత్తా చూపందే సడన్‌గా స్వర్గం రాదయ్యా
బాలయ్య వెంకటేషూ నాగార్జునా నరేషు
రాజేంద్రుడూ సురేషు రాజశేఖరూ అదర్సు
మొత్తంగా అందరూ అయిపోవాలోయ్ మటాషు

వారెవా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు

గూండా రౌడీ దాదా అంటారే బైటుంటే
ఇక్కడ చేసే పన్లే సినిమాల్లో చూపిస్తే
ఓహో అంటూ జై కొడతారు తేడా మేకప్పే
నువ్వుంటే చాల్లే అంటారు కథెందుకు పోన్లే అంటారు
కటౌట్లూ గట్రా కడతారు టికెట్లకు కొట్టుకు ఛస్తారు
బావుంది గాని ప్లాను పల్టీ కొట్టిందో ఏమి గాను
బేకారి బాతు మాను జర దారూ తగ్గించు ఖాను
శకున పక్షిలా తగులుకోకు ముందు

వారెవా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు
వచ్చింది సినిమా ఛాన్సు ఇంక వేసెయ్యి మరో డోసు




vArevA Emi phEsu achchu hIrOlA uMdi bAsu
vachchiMdi sinimA ChAnsu iMka vEseyyi marO DOsu
vArevA Emi phEsu achchu hIrOlA uMdi bAsu
vachchiMdi sinimA ChAnsu iMka vEseyyi marO DOsu
pichchekki ADiyansu rechchipOyElA cheyyi DAnsu
cheppiMdi cheyyarA nIvErA muMdu DEsu
vArevA Emi phEsu achchu hIrOlA uMdi bAsu

amitAbachchanu kannA EM takkuva nuvvainA
hAlivuDlO ayinA evarekkuva nI kannA
phaiTu phITu ATa pATa rAvA nIkainA
chiraMjIvainA puDutUnE megAsTAr ayipOlEdayyA
tegiMchE sattA chUpaMdE saDangA swargaM rAdayyA
bAlayya veMkaTEshU nAgArjunA narEshu
rAjEMdruDU surEshu rAjaSEkharU adarsu
mottaMgA aMdarU ayipOvAlOy maTAshu

vArevA Emi phEsu achchu hIrOlA uMdi bAsu

gUMDA rauDI dAdA aMTArE baiTuMTE
ikkaDa chEsE panlE sinimAllO chUpistE
OhO aMTU jai koDatAru tEDA mEkappE
nuvvuMTE chAllE aMTAru katheMduku pOnlE aMTAru
kaTauTlU gaTrA kaDatAru TikeTlaku koTTuku ChastAru
bAvuMdi gAni plAnu palTI koTTiMdO Emi gAnu
bEkAri bAtu mAnu jara dArU taggiMchu khAnu
Sakuna pakshilA tagulukOku muMdu

vArevA Emi phEsu achchu hIrOlA uMdi bAsu
vachchiMdi sinimA ChAnsu iMka vEseyyi marO DOsu



Lechinde lediki parugu

ఆయిలా ఆయిలా ఆయిలాయి
ఆయిలాయిలాయిలాయి లాయిలాయి
ఆయిలా ఆయిలా ఆయిలాయి
ఆయిలాయిలాయిలాయి లాయిలాయి

లేచిందే లేడికి పరుగు కూచుంటే ఏమిటి జరుగు
తోచిందే వేసేయ్ అడుగు డౌటెందుకు
లేడల్లే ఎందుకు ఉరుకు పడిపోతే పళ్ళు విరుగు
చూడందే వెయ్యకు అడుగు జోరెందుకు
మనకన్నా చిన్నవాళ్ళు
మంజ్రేకర్ టెండుల్కర్లు లేరా మనకెగ్జాంపులు
తుటాల ఫాస్టు బాలు చూస్తేనే గుండె గుభేలు
మనసత్తా సో సింపులు సో సింపులూ
ఎవరి జాతకం వారిది సారు రేఖలేనిదే నెగ్గరు ఎవరూ
రాసివున్నదా చూసుకో గురూ నేటి స్వీపరే next స్పీకరు
లక్కుంటే లకీరుతో లక్ పతిలౌతారు
లైఫంటే నసీబులో స్టారే మాస్టారు

ఆయిలా ఆయిలా ఆయిలాయి
ఆయిలాయిలాయిలాయి లాయిలాయి
ఆయిలా ఆయిలా ఆయిలాయి
ఆయిలాయిలాయిలాయి లాయిలాయి

తాపీ తాబేలు తీరు ఆపేసే హాల్ట్ బోరు
టేకాఫే టాపు గేరు నా నేచరు
కుందేలై గెంతువారు కుదేలయేతీరుతారు
లాకప్‌కో హాస్పిటల్‌కో గెస్టవుదురు
ట్రైలెద్ఢాం కొండకొనకు పోయేదేముంది మనకు
ఆఫ్ట్రాలో వెంట్రుక మన స్టేకు ఆ
ఏదో ఒకటుంది తలకు అది కాస్తా తెంచుకోకు
టోటల్ గా సున్నా అయిపోకు గోవిందా గోవిందా
ఇంటలెక్చువల్ లెక్చర్లేల అడుగు అడుగునా మేధావుల్లా
మైథాలాజికల్ పిక్చర్లోల పొడుగు పొడుగునా పద్యాలేల
చర్చలతో చెడామడా తర్జన బర్జనలా
జంక్షన్‌లో ఎడాపెడా అర్జున గర్జనలా

ఆయిలా ఆయిలా ఆయిలాయి
ఆయిలాయిలాయిలాయి లాయిలాయి
ఆయిలా ఆయిలా ఆయిలాయి
ఆయిలాయిలాయిలాయి లాయిలాయి




AyilA AyilA AyilAyi
AyilAyilAyilAyi lAyilAyi
AyilA AyilA AyilAyi
AyilAyilAyilAyi lAyilAyi

lEchiMdE lEDiki parugu kUchuMTE EmiTi jarugu
tOchiMdE vEsEy aDugu DauTeMduku
lEDallE eMduku uruku paDipOtE paLLu virugu
chUDaMdE veyyaku aDugu jOreMduku
manakannA chinnavALLu
maMjrEkar TeMDulkarlu lErA manakegjAMpulu
tuTAla phAsTu bAlu chUstEnE guMDe gubhElu
manasattA sO siMpulu sO siMpulU
evari jAtakaM vAridi sAru rEkhalEnidE neggaru evarU
rAsivunnadA chUsukO gurU nETi svIparE next spIkaru
lakkuMTE lakIrutO lak patilautAru
laiphaMTE nasIbulO sTArE mAsTAru

AyilA AyilA AyilAyi
AyilAyilAyilAyi lAyilAyi
AyilA AyilA AyilAyi
AyilAyilAyilAyi lAyilAyi

tApI tAbElu tIru ApEsE hAlT bOru
TEkAphE TApu gEru nA nEcharu
kuMdElai geMtuvAru kudElayEtIrutAru
lAkapkO hAspiTalkO gesTavuduru
TrailedDhAM koMDakonaku pOyEdEmuMdi manaku
AphTrAlO veMTruka mana sTEku A
EdO okaTuMdi talaku adi kAstA teMchukOku
TOTal gA sunnA ayipOku gOviMdA gOviMdA
iMTalekchuval lekcharlEla aDugu aDugunA mEdhAvullA
maithAlAjikal pikcharlOla poDugu poDugunA padyAlEla
charchalatO cheDAmaDA tarjana barjanalA
jaMkshanlO eDApeDA arjuna garjanalA

AyilA AyilA AyilAyi
AyilAyilAyilAyi lAyilAyi
AyilA AyilA AyilAyi
AyilAyilAyilAyi lAyilAyi



Paadu kaburu vinagane

పాడు కబురు వినగానే పైకం తెస్తాడా పైకం తెస్తాడా
ఎవ్వడి బాబు సొమ్మంటు వైఫు గొంతు కొస్తాడా
ఎమో ప్లానేశాం గాని పార్ట్నరూ డౌటురా
పాడు కబురు వినగానే పైకం తెస్తాడా పైకం తెస్తాడా

నోరు ముయ్యరా పిరికిపందా శుభం పలకవా..ఉహు
ఆదిలోనే హంసపాదా రేయ్ ఆశ లేదా ఆ ఏంటి?
సపోజు కర్మగాలిపొతే సడెన్‌గా గాలి మారిపోతే
పదేళ్ళు కఠిన ఖైదు అంతే

ఇదిగో మనీ ఎటున్నా విని ఇలా రా కిడ్నాపరు
వదిలెయ్ మరి నా ఇల్లాలిని నా ఇంటికి చిరుదివ్వెని
ఆస్తి పాస్తి బలాదూరెరా నా దేవే మిన్న

ప్రాణాలైనా ఇస్తాగాని మానేనా
పాతాళాన నిను పాతైనీ రాలేనా
పాతాళాన నిను పాతైనీ రాలేనా
ప్రాణం కన్నా పెళ్ళాం మిన్న అంతేగా
నీ చేతుల్లో చచ్చే బాగ్యం నాదేగా
నీ చేతుల్లో చచ్చే బాగ్యం నాదేగా

యురెకా సకామికా తొక్కింది నక్క తోక
నెగ్గింది చిట్కా పండు దొక్కింది జాకా పండు
దొరికెరా ఈజీ ఫైనాన్సు జరుపుకో క్రేజీ రోమాన్సు
యురెకా తకామికా తొక్కింది నక్క తోక

కన్నెగానే ఉండిపోనా కన్న తండ్రి
పెళ్ళి ఊసే మరచిపొనా పిచ్చి తండ్రి
ముల్లె తెచ్చాడుగా పిల్లడు ముళ్ళు వేయించవా ఇప్పుడే

పెళ్ళిఈడు పిల్ల ఉండి కళ్ళ ముందే అల్లుడుండి అల్లుడుండి
టైం వేస్టు చేస్తారేంటి మవయ్యా ఫాదరిన్లా
మా మ్యారేజీకి లేటవుతుంది నీవల్ల

ప్రాపర్టీ పైసాలేదే పోషించే పథకం లేదే
పెళ్ళానికి ఫుడ్డెమిట్రా పచ్చగడ్డి పెడతావా
పోరా సోంబేరిగాడా నీ ఫేసుకి పెళ్ళొకటా
నీకే ఓ గంతలేదే నీ మెడలొ డోలొకటా

రూపాయలొచ్చే సంబరం లల లల
పాపయినిచ్చే సంబరం లల లల
సొమ్మొకళ్ళది సోకొకళ్ళది గప్‌చుప్ గప్‌చుప్
refreshing కోలా.. refreshing కోలా.. Thums up




pADu kaburu vinagAnE paikaM testADA paikaM testADA
evvaDi bAbu sommaMTu waifu goMtu kostADA
emO plAnESAM gAni pArTnarU DauTurA
pADu kaburu vinagAnE paikaM testADA paikaM testADA

nOru muyyarA pirikipaMdA SubhaM palakavA..uhu
AdilOnE haMsapAdA rEy ASa lEdA A EnTi?
sapOju karmagAlipotE saDengA gAli mAripOtE
padELLu kaThina khaidu aMtE

idigO manI eTunnA vini ilA rA kiDnAparu
vadiley mari nA illAlini nA iMTiki chirudivveni
Asti pAsti balAdUrerA nA dEvE minna

prANAlainA istAgAni mAnEnA
pAtALAna ninu pAtainI rAlEnA
pAtALAna ninu pAtainI rAlEnA
prANaM kannA peLLAM minna aMtEgA
nI chEtullO chachchE bAgyaM nAdEgA
nI chEtullO chachchE bAgyaM nAdEgA

yurekA sakAmikA tokkiMdi nakka tOka
neggiMdi chiTkA paMDu dokkiMdi jAkA paMDu
dorikerA IjI phainAnsu jarupukO krEjI rOmAnsu
yurekA takAmikA tokkiMdi nakka tOka

kannegAnE uMDipOnA kanna taMDri
peLLi UsE marachiponA pichchi taMDri
mulle techchADugA pillaDu muLLu vEyiMchavA ippuDE

peLLiIDu pilla uMDi kaLLa muMdE alluDuMDi alluDuMDi
TaiM vEsTu chEstArEMTi mavayyA phAdarinlA
mA myArEjIki lETavutuMdi nIvalla

prAparTI paisAlEdE pOshiMchE pathakaM lEdE
peLLAniki phuDDemiTrA pachchagaDDi peDatAvA
pOrA sOMbErigADA nI phEsuki peLLokaTA
nIkE O gaMtalEdE nI meDalo DOlokaTA

rUpAyalochchE saMbaraM lala lala
pApayinichchE saMbaraM lala lala
sommokaLLadi sOkokaLLadi gapchup gapchup
refreshing kOlA.. refreshing kOlA.. Thums up



My Blog List

Blog Archive