Showing posts with label Chaduvu Samskaram. Show all posts
Showing posts with label Chaduvu Samskaram. Show all posts

Mar 18, 2013

Deepaniki kiranam

దీపానికి కిరణం ఆభరణం
రూపానికి హృదయం ఆభరణం
హృదయానికి ఏనాటికి తరగని సుగుణం ఆభరణం
తరగని సుగుణం ఆభరణం
దీపానికి కిరణం ఆభరణం
రూపానికి హృదయం ఆభరణం

నిండుగ పారే యేరు
తన నీటిని తానే తాగదు
జగతిని చూపే కన్ను
తన ఉనికిని తానే చూడదు
పరుల కోసం బ్రతికే మనిషి
పరుల కోసం బ్రతికే మనిషి
తన బాగు తానే కోరడు
తన బాగు తానే కోరడు

దీపానికి కిరణం ఆభరణం
రూపానికి హృదయం ఆభరణం

తాజమహలులో కురిసే వెన్నెల
పూరి గుడిసెపై కురియదా
బృందావనిలో విరిసే మల్లియ
పేద ముంగిట విరియదా
మంచితనము పంచేవారికి
మంచితనము పంచేవారికి
అంతరాలతో పని ఉందా
అంతరాలతో పని ఉందా

దీపానికి కిరణం ఆభరణం
రూపానికి హృదయం ఆభరణం

వెలుగున ఉన్నంత వరకే
నీ నీడ తోడుగా ఉంటుంది
చీకటిలో నీవు సాగితే
అది నీకు దూరమవుతుంది
ఈ పరమార్థం తెలిసిన నాడే
ఈ పరమార్థం తెలిసిన నాడే
బ్రతుకు సార్థకమవుతుంది
బ్రతుకు సార్థకమవుతుంది

దీపానికి కిరణం ఆభరణం
రూపానికి హృదయం ఆభరణం
హృదయానికి ఏనాటికి తరగని సుగుణం ఆభరణం
తరగని సుగుణం ఆభరణం




dIpAniki kiraNaM AbharaNaM
rUpAniki hRdayaM AbharaNaM
hRdayAniki EnATiki taragani suguNaM AbharaNaM
taragani suguNaM AbharaNaM
dIpAniki kiraNaM AbharaNaM
rUpAniki hRdayaM AbharaNaM

niMDuga pArE yEru
tana nITini tAnE tAgadu
jagatini chUpE kannu
tana unikini tAnE chUDadu
parula kOsaM bratikE manishi
parula kOsaM bratikE manishi
tana bAgu tAnE kOraDu
tana bAgu tAnE kOraDu

dIpAniki kiraNaM AbharaNaM
rUpAniki hRdayaM AbharaNaM

tAjamahalulO kurisE vennela
pUri guDisepai kuriyadA
bRMdAvanilO virisE malliya
pEda muMgiTa viriyadA
maMchitanamu paMchEvAriki
maMchitanamu paMchEvAriki
aMtarAlatO pani uMdA
aMtarAlatO pani uMdA

dIpAniki kiraNaM AbharaNaM
rUpAniki hRdayaM AbharaNaM

veluguna unnanta varakE
nI nIDa tODugA unTundi
cIkaTilO nIvu sAgitE
adi nIku dUramavutundi
I paramArtham telisina nADE
I paramArtham telisina nADE
bratuku sArthakamavutundi
bratuku sArthakamavutundi

dIpAniki kiraNaM AbharaNaM
rUpAniki hRdayaM AbharaNaM
hRdayAniki EnATiki taragani suguNaM AbharaNaM
taragani suguNaM AbharaNaM



Nenu evvaro adagaku

నేను ఎవ్వరో అడగకు నువ్వు ఎవ్వరో అడగను
నీ కొరకే ఈ సందడి
తెల్లవారే వరకే ఈ ముడి ఈ సందడి
నేను ఎవ్వరో అడగకు నువ్వు ఎవ్వరో అడగను

వయసు ఇంద్ర ధనుస్సు
క్షణకాలం దాని సొగసు
తెలుసు నాకు తెలుసు
ఈ నిజం నీకు తెలుసు
మధురమైన పెదవులుండగా
మధువు ఎందుకు దండగ దండగ

నేను ఎవ్వరో అడగకు నువ్వు ఎవ్వరో అడగను
నీ కొరకే ఈ సందడి
తెల్లవారే వరకే ఈ ముడి ఈ సందడి
నేను ఎవ్వరో అడగకు నువ్వు ఎవ్వరో అడగను

కాలం కడలి కెరటం
ఆగవులే ఎవరి కోసం
పరువం కన్నె పరువం
పారేను తోడు కోసం
తలుపులే లేని కోటను
తలపులున్న వారి బాటను వలపు బాటను

నేను ఎవ్వరో అడగకు నువ్వు ఎవ్వరో అడగను
నీ కొరకే ఈ సందడి
తెల్లవారే వరకే ఈ ముడి ఈ సందడి
నేను ఎవ్వరో అడగకు నువ్వు ఎవ్వరో అడగను




nEnu evvarO aDagaku nuvvu evvarO aDaganu
nI korakE I sandaDi
tellavArE varakE I muDi I sandaDi
nEnu evvarO aDagaku nuvvu evvarO aDaganu

vayasu indra dhanussu
kshaNakAlam dAni sogasu
telusu nAku telusu
I nijam nIku telusu
madhuramaina pedavulunDagA
madhuvu enduku danDaga danDaga

nEnu evvarO aDagaku nuvvu evvarO aDaganu
nI korakE I sandaDi
tellavArE varakE I muDi I sandaDi
nEnu evvarO aDagaku nuvvu evvarO aDaganu

kAlam kaDali keraTam
AgavulE evari kOsam
paruvam kanne paruvam
pArEnu tODu kOsam
talupulE lEni kOTanu
talapulunna vAri bATanu valapu bATanu

nEnu evvarO aDagaku nuvvu evvarO aDaganu
nI korakE I sandaDi
tellavArE varakE I muDi I sandaDi
nEnu evvarO aDagaku nuvvu evvarO aDaganu



My Blog List

Blog Archive