Showing posts with label Annamayya. Show all posts
Showing posts with label Annamayya. Show all posts

Apr 6, 2013

Nigama nigamanta varnita

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజధరుడా శ్రీనారాయణ
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజధరుడా శ్రీనారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వేంకట నారాయణ

దీపించు వైరాగ్య దివ్య సౌంఖ్యంబీయ
నోపక కదా నన్ను నొడబరుపుచు పైపై
పైపైన సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లునా నారాయణ
పైపైని సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లునా నారాయణ
నిగమ గమదని సగమగసని

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజధరుడ శ్రీనారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మి నారాయణ

నీస గ సగసగసగసగ
దనిసగమగసగమగ సనిదస నీసాద
సగమ గమగ మదని దనిసమగసనిదమగస

వివిధ నిర్భంధముల
వివిధ నిర్భంధముల వెడలద్రోయకనన్ను
భవసాగరముల దడబడజేతురా
దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ హరే హరే హరే
దివిజేంధ్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ
నవనీతచోర శ్రీ నారాయణ
నిగమ సగమగసనిదమగని
నిగమ గసమగదమనిదస

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజధరుడ శ్రీనారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ
వేద నారాయణ వేంకట నారాయణ
తిరుమల నారాయణ కలియుగ నారాయణ
హరి హరి నారాయణ ఆది నారాయణ
లక్ష్మి నారాయణ శ్రీమన్నారాయణ హరే హరే హరే




nigama nigamAMta varNita manOhara rUpa
nagarAjadharuDA SrInArAyaNa
nigama nigamAMta varNita manOhara rUpa
nagarAjadharuDA SrInArAyaNa
nArAyaNa SrImannArAyaNa nArAyaNa vEMkaTa nArAyaNa

dIpiMchu vairAgya divya sauMkhyaMbIya
nOpaka kadA nannu noDabarupuchu paipai
paipaina saMsAra baMdhamula kaTTEvu
nA paluku chellunA nArAyaNa
paipaini saMsAra baMdhamula kaTTEvu
nA paluku chellunA nArAyaNa
nigama gamadani sagamagasani

nigama nigamAMta varNita manOhara rUpa
nagarAjadharuDa SrInArAyaNa
nArAyaNa SrImannArAyaNa nArAyaNa lakshmi nArAyaNa

nIsa ga sagasagasagasaga
danisagamagasagamaga sanidasa nIsAda
sagama gamaga madani danisamagasanidamagasa

vividha nirbhaMdhamula
vividha nirbhaMdhamula veDaladrOyakanannu
bhavasAgaramula daDabaDajEturA
divijEMdravaMdhya SrI tiruvEMkaTAdrISa harE harE harE
divijEMdhravaMdhya SrI tiruvEMkaTAdrISa
navanItachOra SrI nArAyaNa
nigama sagamagasanidamagani
nigama gasamagadamanidasa

nigama nigamAMta varNita manOhara rUpa
nagarAjadharuDa SrInArAyaNa
nArAyaNa SrImannArAyaNa nArAyaNa
vEda nArAyaNa vEMkaTa nArAyaNa
tirumala nArAyaNa kaliyuga nArAyaNa
hari hari nArAyaNa Adi nArAyaNa
lakshmi nArAyaNa SrImannArAyaNa harE harE harE



Kalaganti kalaganti

కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి
ఎల్లలోకములకు అప్పడగు తిరు వేంకటాద్రీశుగంటి
కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి
ఎల్లలోకములకు అప్పడగు తిరు వేంకటాద్రీశుగంటి
ఇప్పుడిటు కలగంటి..

అతిశయంబైన శేషాధ్రి శిఖరముగంటి
ప్రతిలేని గోపుర ప్రభలుగంటి
శతకోతి సూర్యతేజములు వెలుగగగంటి
చతురాస్యు పొడగంటి చతురాస్యు పొడగంటి
చయ్యన మేలుకొంటి
ఇప్పుడిటు కలగంటి..

అరుదైన శంఖచక్రాదులిరుగడగంటి
సరిలేని అభయ హస్తమును కంటి
తిరు వేంకటాచలదిపుని చూడగా కంటి
హరిగంటి గురుగంటి
హరిగంటి గురుగంటి
అంతట మేలుకంటి

కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి
ఎల్లలోకములకు అప్పడగు తిరు వేంకటాద్రీశుగంటి
ఇప్పుడిటు కలగంటి ఇప్పుడిటు కలగంటి




kalagaMTi kalagaMTi ippuDiTu kalagaMTi
ellalOkamulaku appaDagu tiru vEMkaTAdrISugaMTi
kalagaMTi kalagaMTi ippuDiTu kalagaMTi
ellalOkamulaku appaDagu tiru vEMkaTAdrISugaMTi
ippuDiTu kalagaMTi..

atiSayaMbaina SEshAdhri SikharamugaMTi
pratilEni gOpura prabhalugaMTi
SatakOti sUryatEjamulu velugagagaMTi
chaturAsyu poDagaMTi chaturAsyu poDagaMTi
chayyana mElukoMTi
ippuDiTu kalagaMTi..

arudaina SaMkhachakrAdulirugaDagaMTi
sarilEni abhaya hastamunu kaMTi
tiru vEMkaTAchaladipuni chUDagA kaMTi
harigaMTi gurugaMTi
harigaMTi gurugaMTi
aMtaTa mElukaMTi

kalagaMTi kalagaMTi ippuDiTu kalagaMTi
ellalOkamulaku appaDagu tiru vEMkaTAdrISugaMTi
ippuDiTu kalagaMTi ippuDiTu kalagaMTi



Vinnapalu vinavale

విన్నపాలు వినవలె వింత వింతలు
విన్నపాలు వినవలె వింత వింతలు
పన్నగపు దోమ తెర పైకెత్త వేళయ్య
విన్నపాలు వినవలె వింత వింతలు
పన్నగపు దోమ తెర పైకెత్త వేళయ్య
విన్నపాలు వినవలె వింత వింతలు

కంటి శుక్రవారము గడియలేడింట
అంటి అలమేలుమంగ అండనుండే స్వామిని
కంటి శుక్రవారము గడియలేడింట
అంటి అలమేలుమంగ అండనుండే స్వామిని
కంటి...

పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరిలి నవ్వినీ పెండ్లి కూతురు
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరిలి నవ్వీనీ పెండ్లి కూతురు
పేరుగల జవరాలీ పెండ్లి కూతురు
పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
విభు పేరు గుచ్చ సిగ్గు పడి పెండ్లి కూతురు

అలర చంచలమైన ఆత్మలందుండ నీ
అలవాటు చేసెనీ ఉయ్యాల
అలర చంచలమైన ఆత్మలందుండ నీ
అలవాటు చేసెనీ ఉయ్యాల
పలుమారు ఉఛ్వాస పవనమందుండ
నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల
పలుమారు ఉఛ్వాస పవనమందుండ
నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల
ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల
ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల




vinnapAlu vinavale viMta viMtalu
vinnapAlu vinavale viMta viMtalu
pannagapu dOma tera paiketta vELayya
vinnapAlu vinavale viMta viMtalu
pannagapu dOma tera paiketta vELayya
vinnapAlu vinavale viMta viMtalu

kaMTi SukravAramu gaDiyalEDiMTa
aMTi alamElumaMga aMDanuMDE swAmini
kaMTi SukravAramu gaDiyalEDiMTa
aMTi alamElumaMga aMDanuMDE swAmini
kaMTi...

piDikiTa talaMbrAla peMDli kUturu
koMta peDamarili navvinI peMDli kUturu
piDikiTa talaMbrAla peMDli kUturu
koMta peDamarili navvInI peMDli kUturu
pErugala javarAlI peMDli kUturu
pedda pErula mutyAla meDa peMDli kUturu
pEraMTAMDla naDimi peMDli kUturu
pEraMTAMDla naDimi peMDli kUturu
vibhu pEru guchcha siggu paDi peMDli kUturu

alara chaMchalamaina AtmalaMduMDa nI
alavATu chEsenI uyyAla
alara chaMchalamaina AtmalaMduMDa nI
alavATu chEsenI uyyAla
palumAru uChvAsa pavanamaMduMDa
nI bhAvaMbu telipenI uyyAla
palumAru uChvAsa pavanamaMduMDa
nI bhAvaMbu telipenI uyyAla
uyyAla uyyAla uyyAla uyyAla
uyyAla uyyAla uyyAla uyyAla



Telugu padaniki

ఓం ఓం
తెలుగు పదానికి జన్మదినం
ఇది జాన పదానికి జ్ఞానపథం
ఏడు స్వరాలే ఏడు కొండలై
వెలసిన కలియుగ విష్ణు పదం
అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం

అరిషడ్వర్గము తెగనరికే హరిఖడ్గమ్మిది నందకము
బ్రహ్మలోకమున బ్రహ్మభారతి నాదాశీస్సులు పొందినదై
శివలోకమ్మున చిద్విలాసమున ఢమరుధ్వనిలో గమకితమై
దివ్యసభలలో నవ్యలాస్యముల పూబంతుల చేబంతిగా ఎగసి
నీరద మండల నారద తుంబుర మహతీ గానవు మహిమలు తెలిసి
సితహిమ కందర యతిరాట్సభలో తప: ఫలమ్ముగ తళుకుమని
తల్లి తనముకై తల్లడిల్లు ఆ లక్కమాంబ గర్భాలయమ్ములో
ప్రవేశించె ఆ నందకము నందనానంద కారకము

అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం

పద్మావతియే పురుడు పోయగా పధ్మాసనుడే ఉసురు పోయగా
విష్ణు తేజమై నాద బీజమై అంధ్ర సాహితి అమర కోశమై
అవతరించెను అన్నమయ్య అసతోమా సద్గమయ
అవతరించెను అన్నమయ్య అసతోమా సద్గమయ

పాపడుగా నట్టింట పాకుతూ భాగవతము చేపట్టెనయా
హరినామమ్మును ఆలకించక అరముద్దలనే ముట్టడయా
తెలుగు భారతికి వెలుగు హారతై ఎదలయలో పద కవితలు కలయ
తాళ్ళపాకలో ఎదిగె అన్నమయ్య తమసోమా జ్యోతిర్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
తమసోమా జ్యోతిర్గమయ




OM OM
telugu padAniki janmadinaM
idi jAna padAniki j~nAnapathaM
EDu swarAlE EDu koMDalai
velasina kaliyuga vishNu padaM
annamayya jananaM
idi annamayya jananaM
idi annamayya jananaM

arishaDvargamu teganarikE harikhaDgammidi naMdakamu
brahmalOkamuna brahmabhArati nAdASIssulu poMdinadai
SivalOkammuna chidvilAsamuna DhamarudhvanilO gamakitamai
divyasabhalalO navyalAsyamula pUbaMtula chEbaMtigA egasi
nIrada maMDala nArada tuMbura mahatI gAnavu mahimalu telisi
sitahima kaMdara yatirATsabhalO tapa: phalammuga taLukumani
talli tanamukai tallaDillu A lakkamAMba garbhAlayammulO
pravESiMche A naMdakamu naMdanAnaMda kArakamu

annamayya jananaM
idi annamayya jananaM
idi annamayya jananaM

padmAvatiyE puruDu pOyagA padhmAsanuDE usuru pOyagA
vishNu tEjamai nAda bIjamai aMdhra sAhiti amara kOSamai
avatariMchenu annamayya asatOmA sadgamaya
avatariMchenu annamayya asatOmA sadgamaya

pApaDugA naTTiMTa pAkutU bhAgavatamu chEpaTTenayA
harinAmammunu AlakiMchaka aramuddalanE muTTaDayA
telugu bhAratiki velugu hAratai edalayalO pada kavitalu kalaya
tALLapAkalO edige annamayya tamasOmA jyOtirgamaya
tamasOmA jyOtirgamaya
tamasOmA jyOtirgamaya



Vinaro bhagyamu

వినరో భాగ్యము విష్ణు కథ
వెనుబలమిదివో విష్ణు కథ
వినరో భాగ్యము విష్ణు కథ
వెనుబలమిదివో విష్ణు కథ
వినరో భాగ్యము విష్ణు కథ

చేరియశోదకు శిశువితడు
దారుణి బ్రహ్మకు తండ్రియునితడు
చేరియశోదకు శిశువితడు
దారుణి బ్రహ్మకు తండ్రియునితడు
చేరియశోదకు శిశువితడు

అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము
అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము
అణురేణు పరిపూర్ణమైన రూపము

ఏమని పొగడుదుమే ఇక నిను
ఆమని సొబగుల అలమేల్మంగ
ఏమని పొగడుదుమే..

వేడుకొందామా వేడుకొందామా
వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని వేడుకొందామా
వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని వేదుకొందామా
ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే
ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే
వాడు అలమేల్మంగ వాడు అలమేల్మంగ శ్రీవెంకటాధ్రి నాథుడే
వేడుకొందామా వేడుకొందామా వేంకటగిరి వేంకటెశ్వరుని
వేడుకొందామా వేడుకొందామా వేడుకొందామా వేడుకొందామా
ఏడు కొండల వాడా వేంకటారమణ గోవింద గోవిందా
ఏడు కొండల వాడా వేంకటారమణ గోవింద గోవిందా
ఏడు కొండల వాడా వేంకటారమణ గోవిందా గోవిందా

ఇందరికి అభయంబులిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి
ఇందరికి అభయంబులిచ్చు చేయి
ఇందరికి అభయంబులిచ్చు చేయి




vinarO bhAgyamu vishNu katha
venubalamidivO vishNu katha
vinarO bhAgyamu vishNu katha
venubalamidivO vishNu katha
vinarO bhAgyamu vishNu katha

chEriyaSOdaku SiSuvitaDu
dAruNi brahmaku taMDriyunitaDu
chEriyaSOdaku SiSuvitaDu
dAruNi brahmaku taMDriyunitaDu
chEriyaSOdaku SiSuvitaDu

aNurENu paripUrNamaina rUpamu
aNimAdi siri aMjanAdri mIdi rUpamu
aNurENu paripUrNamaina rUpamu
aNimAdi siri aMjanAdri mIdi rUpamu
aNurENu paripUrNamaina rUpamu

Emani pogaDudumE ika ninu
Amani sobagula alamElmaMga
Emani pogaDudumE..

vEDukoMdAmA vEDukoMdAmA
vEDukoMdAmA vEMkaTagiri vEMkaTESvaruni vEDukoMdAmA
vEDukoMdAmA vEMkaTagiri vEMkaTESvaruni vEdukoMdAmA
elami kOrina varAlichchE dEvuDE
elami kOrina varAlichchE dEvuDE
vADu alamElmaMga vADu alamElmaMga SrIveMkaTAdhri nAthuDE
vEDukoMdAmA vEDukoMdAmA vEMkaTagiri vEMkaTeSvaruni
vEDukoMdAmA vEDukoMdAmA vEDukoMdAmA vEDukoMdAmA
EDu koMDala vADA vEMkaTAramaNa gOviMda gOviMdA
EDu koMDala vADA vEMkaTAramaNa gOviMda gOviMdA
EDu koMDala vADA vEMkaTAramaNa gOviMdA gOviMdA

iMdariki abhayaMbulichchu chEyi
kaMduvagu maMchi baMgAru chEyi
iMdariki abhayaMbulichchu chEyi
iMdariki abhayaMbulichchu chEyi



Podagantimayya mimmu

పురుషోత్తమా పురుషోత్తమా పురుషోత్తమా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్య కోనేటి రాయడా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్య కోనేటి రాయడా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా

కోరిమమ్ము నేలినట్టి కులదైవమా
చాలా నేరిచి పెద్దలిచ్చిన నిదానమ
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా
మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా

పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్య కోనేటి రాయడా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా

చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా
ఓం నమో వేంకటేశాయ
ఓం నమో వేంకటేశాయ
చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా
రోగాలడచి రక్షించే దివ్యౌషధమా
బడిబాయక తిరిగే ప్రాణ బంధుడా
బడిబాయక తిరిగే ప్రాణ బంధుడా
బడిబాయక తిరిగే ప్రాణ బంధుడా
మమ్ము గడియించినట్టి శ్రీవేంకటనాఠుడా

పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్య కోనేటి రాయడా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
పురుషోత్తమా పురుషోత్తమా పురుషోత్తమా




purushOttamA purushOttamA purushOttamA
poDagaMTimayyA mimmu purushOttamA
poDagaMTimayyA mimmu purushOttamA
mammu eDayakavayya kOnETi rAyaDA
poDagaMTimayyA mimmu purushOttamA
mammu eDayakavayya kOnETi rAyaDA
poDagaMTimayyA mimmu purushOttamA

kOrimammu nElinaTTi kuladaivamA
chAlA nErichi peddalichchina nidAnama
gAraviMchi dappidIrchu kAlamEghamA
gAraviMchi dappidIrchu kAlamEghamA
gAraviMchi dappidIrchu kAlamEghamA
mAku chEruva chittamulOni SrInivAsuDA

poDagaMTimayyA mimmu purushOttamA
mammu eDayakavayya kOnETi rAyaDA
poDagaMTimayyA mimmu purushOttamA

cheDanIka bratikiMchE siddhamaMtramA
OM namO vEMkaTESAya
OM namO vEMkaTESAya
cheDanIka bratikiMchE siddhamaMtramA
rOgAlaDachi rakshiMchE divyaushadhamA
baDibAyaka tirigE prANa baMdhuDA
baDibAyaka tirigE prANa baMdhuDA
baDibAyaka tirigE prANa baMdhuDA
mammu gaDiyiMchinaTTi SrIvEMkaTanAThuDA

poDagaMTimayyA mimmu purushOttamA
mammu eDayakavayya kOnETi rAyaDA
poDagaMTimayyA mimmu purushOttamA
purushOttamA purushOttamA purushOttamA



Musina mutyalake

మూసిన ముత్యాలకేలే మొరగలు మ్మ్..
ఆశల చిత్తానికేలే అలవోకలు
మూసిన ముత్యాలకేలే మొరగలు
ఆశల చిత్తానికేలే అలవోకలు
మూసిన ముత్యాలకేలే మొరగలు
ఆశల చిత్తానికేలే అలవోకలు

కందులేని మొమునకేలే కస్తూరి
చిందు నీ కొప్పునకేలే చేమంతులు
మందయానమునకేలే మట్టెల మోతలు
మందయానమునకేలే మట్టెల మోతలు
గంధమేలే పైకమ్మని నీ మేనికి

మూసిన ముత్యాలకేలే మొరగలు
ఆశల చిత్తానికేలే అలవోకలు

ముద్దుముద్దు మాటలకేలే ముదములు
నీ అద్దపు చెక్కిలికేలే అరవిరి
ఒద్దిక కూటమికేలే ఏలే ఏలే ఏలేలే
ఒద్దిక కూటమికేలే ఊర్పులు
నీకు అద్దమేలే తిరు వేంకటాద్రీశుగూడి

మూసిన ముత్యాలకేలే మొరగలు
ఆశల చిత్తానికేలే అలవోకలు




mUsina mutyAlakElE moragalu mm..
ASala chittAnikElE alavOkalu
mUsina mutyAlakElE moragalu
ASala chittAnikElE alavOkalu
mUsina mutyAlakElE moragalu
ASala chittAnikElE alavOkalu

kaMdulEni momunakElE kastUri
chiMdu nI koppunakElE chEmaMtulu
maMdayAnamunakElE maTTela mOtalu
maMdayAnamunakElE maTTela mOtalu
gaMdhamElE paikammani nI mEniki

mUsina mutyAlakElE moragalu
ASala chittAnikElE alavOkalu

muddumuddu mATalakElE mudamulu
nI addapu chekkilikElE araviri
oddika kUTamikElE ElE ElE ElElE
oddika kUTamikElE Urpulu
nIku addamElE tiru vEMkaTAdrISugUDi

mUsina mutyAlakElE moragalu
ASala chittAnikElE alavOkalu



Emoko chigutadharamuna

గోవిందా నిశ్చలాలంద మందార మకరందా
నీ నామం మధురం నీ రూపం మధురం
నీ సరస శృంగార కీర్తన
మధురాతి మధురం స్వామి

ఏమొకో ఏమొకో
చిగురుటధరమున ఎడ నెడ కస్తూరి నిండెను
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా
ఏమొకో ఏమొకో
చిగురుటధరమున ఎడ నెడ కస్తూరి నిండెను

కలికి చకోరాక్షికి కడ కన్నులు కెంపై తోచిన
చెలువంబిప్పుడిదేమో చింతింపరే చెలులు
నలువున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులు
నలువున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులు
నిలువున పెరుకగా నంటిన నెత్తురు కాదు కదా

ఏమొకో ఏమొకో
చిగురుటధరమున ఎడ నెడ కస్తూరి నిండెను ఆ...

జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర
జగడపు చనవుల జాజర
తరిక్త జం జం జం జం జం జం కరికిట తరికిటతోం
మొల్లలు తురుముల ముడిచిన బరువున
మొల్లపు సరసపు మురిపెమున
జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లేరతివలు జాజర

జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర
జగడపు చనవుల జాజర
తా ధనక్ తా జనుక్ తా ధిమిక్ తా తధీం గిణతోం

బారపు కుచముల పైపై కడుసింగారం నెరపెడి గంధ ఒడి
చేరువ పతిపై చిందగా పడతులు సారెకు చల్లేరు జాజర
జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర
జగడపు చనవుల జాజర
తత్త ధిత్త జనుతాం కరికిడ తిరగడతోం
తత్త ధిత్త జను తధీం తిరగడతో
తది తధీం త జను తధీం త తత్తీం
గిణతోం తధీం గిణతోం తరిగిడ తరిగిడత

బింకపు కూటమి పెనగెటి చెమటల
పంకపు పూతల పరిమళము
వేంకటపతిపై వెలదులు నించేరు
సంకుమదమ్ముల జాజర
జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర
జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర
జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర
జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర
జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర
జగడపు చనవుల జాజర జగడపు చనవుల జాజర
జగడపు చనవుల జాజర..




gOviMdA niSchalAlaMda maMdAra makaraMdA
nI nAmaM madhuraM nI rUpaM madhuraM
nI sarasa SRMgAra kIrtana
madhurAti madhuraM swAmi

EmokO EmokO
chiguruTadharamuna eDa neDa kastUri niMDenu
bhAmini vibhunaku vrAsina patrika kAdu kadA
EmokO EmokO
chiguruTadharamuna eDa neDa kastUri niMDenu

kaliki chakOrAkshiki kaDa kannulu keMpai tOchina
cheluvaMbippuDidEmO chiMtiMparE chelulu
naluvuna prANESvarupai nATina A kona chUpulu
naluvuna prANESvarupai nATina A kona chUpulu
niluvuna perukagA naMTina netturu kAdu kadA

EmokO EmokO
chiguruTadharamuna eDa neDa kastUri niMDenu A...

jagaDapu chanavula jAjara saginala maMchapu jAjara
jagaDapu chanavula jAjara
tarikta jaM jaM jaM jaM jaM jaM karikiTa tarikiTatOM
mollalu turumula muDichina baruvuna
mollapu sarasapu muripemuna
jallana puppoDi jAraga patipai challErativalu jAjara

jagaDapu chanavula jAjara saginala maMchapu jAjara
jagaDapu chanavula jAjara
tA dhanak tA januk tA dhimik tA tadhIm giNatOm

bArapu kuchamula paipai kaDusiMgAraM nerapeDi gaMdha oDi
chEruva patipai chiMdagA paDatulu sAreku challEru jAjara
jagaDapu chanavula jAjara saginala maMchapu jAjara
jagaDapu chanavula jAjara
tatta dhitta janutAm karikiDa tiragaDatOm
tatta dhitta janu tadhIm tiragaDatO
tadi tadhIm ta janu tadhIm ta tattIm
giNatOm tadhIm giNatOm tarigiDa tarigiData

biMkapu kUTami penageTi chemaTala
paMkapu pUtala parimaLamu
vEMkaTapatipai veladulu niMchEru
saMkumadammula jAjara
jagaDapu chanavula jAjara saginala maMchapu jAjara
jagaDapu chanavula jAjara saginala maMchapu jAjara
jagaDapu chanavula jAjara saginala maMchapu jAjara
jagaDapu chanavula jAjara saginala maMchapu jAjara
jagaDapu chanavula jAjara saginala maMchapu jAjara
jagaDapu chanavula jAjara jagaDapu chanavula jAjara
jagaDapu chanavula jAjara..



Antaryami alasiti

అంతర్యామి అలసితి సొలసితి
ఇంతటి నీ శరణిదే చొచ్చితిని
అంతర్యామి అలసితి సొలసితి

కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవవి తెంచక
కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవవి తెంచక
భారపు పగ్గాలు పాపపుణ్యములు
భారపు పగ్గాలు పాపపుణ్యములు
నేరుపున బోవు నీవు వద్దనక

అంతర్యామి అలసితి సొలసితి
ఇంతటి నీ శరణిదే చొచ్చితిని
అంతర్యామి...

మదిలో చింతలు మయలలు మణుగులు
వదలవు నీవవి వద్దనక
మదిలో చింతలు మయలలు మణుగులు
వదలవు నీవవి వద్దనక
ఎదుటనే శ్రీవేంకటేశ్వర..
వేంకటేశా శ్రీనివాస ప్రభో
ఎదుటనే శ్రీవేంకటేశ్వర నీవదె
అదన గాచితివి అట్టిట్టనక

అంతర్యామి అలసితి సొలసితి
ఇంతటి నీ శరణిదే చొచ్చితిని
అంతర్యామి అంతర్యామి
అంతర్యామి అంతర్యామి
అంతర్యామి అంతర్యామి
అంతర్యామి అంతర్యామి
అలసితి...




aMtaryAmi alasiti solasiti
iMtaTi nI SaraNidE chochchitini
aMtaryAmi alasiti solasiti

kOrina kOrkelu kOyani kaTlu tIravu nIvavi teMchaka
kOrina kOrkelu kOyani kaTlu tIravu nIvavi teMchaka
bhArapu paggAlu pApapuNyamulu
bhArapu paggAlu pApapuNyamulu
nErupuna bOvu nIvu vaddanaka

aMtaryAmi alasiti solasiti
iMtaTi nI SaraNidE chochchitini
aMtaryAmi...

madilO chiMtalu mayalalu maNugulu
vadalavu nIvavi vaddanaka
madilO chiMtalu mayalalu maNugulu
vadalavu nIvavi vaddanaka
eduTanE SrIvEMkaTESvara..
vEMkaTESA SrInivAsa prabhO
eduTanE SrIvEMkaTESvara nIvade
adana gAchitivi aTTiTTanaka

aMtaryAmi alasiti solasiti
iMtaTi nI SaraNidE chochchitini
aMtaryAmi aMtaryAmi
aMtaryAmi aMtaryAmi
aMtaryAmi aMtaryAmi
aMtaryAmi aMtaryAmi
alasiti...



Adivo alladivo

ఏడు కొండల వాడా వెంకటా రమణ గోవిందా గోవిందా
అదివో.. ఓ..ఓ..ఓ..
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
అదివో అల్లదివో శ్రీహరి వాసము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పది వేలు శేషుల పడగలమయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పది వేలు శేషుల పడగలమయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
ఏడు కొండల వాడా వెంకటా రమణ గోవిందా గోవిందా
ఏడు కొండల వాడా వెంకటా రమణ గోవిందా గోవిందా

అదే వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిలమునులకు
వేంకటరమణ సంకట హరన
వేంకటరమణ సంకట హరన
వేంకటరమణ సంకట హరన
వేంకటరమణ సంకట హరన
నారాయణ నారాయణ
అదివో నిత్యనివాస మఖిలమునులకు
అదె చూడుడు అదెమ్రొక్కుడు ఆనంద మయము
అదె చూడుడు అదెమ్రొక్కుడానంద మయము

అదివో అల్లదివో శ్రీహరి వాసము
వడ్డికాసులవాడ వెంకటా రమణ గోవిందా గోవిందా
ఆపదమొక్కులవాడ అనాథ రక్షక గోవిందా గోవిందా

కైవల్య పదము వేంకటనగ మదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది
భావింప సకల సంపద రూప మదివో అదివో అదివో
వేంకటరమణ సంకటహరన
వేంకటరమణ సంకటహరన
భావింప సకల సంపద రూప మదివో
పావనములకెల్ల పావన మయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
శ్రీహరి వాసము శ్రీహరి వాసము

వెంకటేశా నమో శ్రీనివాసా నమో
వెంకటేశా నమో శ్రీనివాసా నమో
ఏడు కొండల వాడ వెంకటా రమణ గోవిందా గోవిందా
ఏడు కొండల వాడ వెంకటా రమణ గోవిందా గోవిందా
ఏడు కొండల వాడ వెంకటా రమణ గోవిందా గోవిందా
అదివో అదివొ అదివో




EDu koMDala vADA veMkaTA ramaNa gOviMdA gOviMdA
adivO.. O..O..O..
gOviMda gOviMda gOviMda gOviMda gOviMda
gOviMda gOviMda gOviMda gOviMda gOviMda
adivO alladivO SrIhari vAsamu
adivO alladivO SrIhari vAsamu
padi vElu SEshula paDagalamayamu
adivO alladivO SrIhari vAsamu
padi vElu SEshula paDagalamayamu
adivO alladivO SrIhari vAsamu
EDu koMDala vADA veMkaTA ramaNa gOviMdA gOviMdA
EDu koMDala vADA veMkaTA ramaNa gOviMdA gOviMdA

adE vEMkaTAchala makhilOnnatamu
adivO brahmAdula kapurUpamu
adivO nityanivAsa makhilamunulaku
vEMkaTaramaNa saMkaTa harana
vEMkaTaramaNa saMkaTa harana
vEMkaTaramaNa saMkaTa harana
vEMkaTaramaNa saMkaTa harana
nArAyaNa nArAyaNa
adivO nityanivAsa makhilamunulaku
ade chUDuDu ademrokkuDu AnaMda mayamu
ade chUDuDu ademrokkuDAnaMda mayamu

adivO alladivO SrIhari vAsamu
vaDDikAsulavADa veMkaTA ramaNa gOviMdA gOviMdA
ApadamokkulavADa anAtha rakshaka gOviMdA gOviMdA

kaivalya padamu vEMkaTanaga madivO
SrI vEMkaTapatiki sirulainadi
bhAviMpa sakala saMpada rUpa madivO adivO adivO
vEMkaTaramaNa saMkaTaharana
vEMkaTaramaNa saMkaTaharana
bhAviMpa sakala saMpada rUpa madivO
pAvanamulakella pAvana mayamu
adivO alladivO SrIhari vAsamu
SrIhari vAsamu SrIhari vAsamu

veMkaTESA namO SrInivAsA namO
veMkaTESA namO SrInivAsA namO
EDu koMDala vADa veMkaTA ramaNa gOviMdA gOviMdA
EDu koMDala vADa veMkaTA ramaNa gOviMdA gOviMdA
EDu koMDala vADa veMkaTA ramaNa gOviMdA gOviMdA
adivO adivo adivO



Ele ele maradala

ఏలే ఏలే మరదలా
వాలే వాలే వరసలా
నచ్చింది నచ్చింది నాజూకు
నీకే ఇస్తా సోకులు
ఇచ్చేయి పచ్చారు సొగసులు
చాలు నీ తోటి
అహ చాలు నీ తోటి సరసాలు బావ
ఏలే ఏలే మరదలా
వాలే వాలే వరసలా

గాటపు గుబ్బలు కదలగ కులికేవు
మాటల తేటల మరదలా
వేటరి చూపులు విసురుచూ మురిసేవు
వాటపు వలపుల వరదలా
చీటికి మాటికి చనకేవు
చీటికి మాటికి చనకేవు
వట్టి బూటకాలు మాని పోవే బావ
చాలు చాలు నీతోటి
అహ చాలు నీ తోటి సరసాలు బావ

ఏలే ఏలే మరదలా
వాలే వాలే వరసలా
నచ్చింది నచ్చింది నాజూకు
నీకే ఇస్తా సోకులు
ఇచ్చేయి పచ్చారు సొగసులు
చాలు నీ తోటి
అహ చాలు నీ తోటి సరసాలు బావ
ఏలే ఏలే మరదలా
వాలే వాలే వరసలా

కన్నుల గంటపు కవితలు గిలికేవు
నా ఎద చాటున మరదలా
పాడని పాటల పైటలు సరిదేవు
పల్లవి పదముల దరువులా
కంటికి వంటికి కలిపేవు
కంటికి వంటికి కలిపేవు
ఎన్ని కొంటె లీలాలంట కోలో బావ
అహ పాడుకో పాట
జంట పాడుకున్న పాట జజిపూదోట

ఏలే ఏలే మరదలా
వాలే వాలే వరసలా
నచ్చింది నచ్చింది నాజూకు
నీకే ఇస్తా సోకులు
ఇచ్చేయి పచ్చారు సొగసులు
చాలు నీ తోటి
అహ చాలు నీ తోటి సరసాలు బావ
ఏలే ఏలే మరదలా
వాలే వాలే వరసలా
ఏలే ఏలే మరదలా
వాలే వాలే వరసలా




ElE ElE maradalA
vAlE vAlE varasalA
nachchiMdi nachchiMdi nAjUku
nIkE istA sOkulu
ichchEyi pachchAru sogasulu
chAlu nI tOTi
aha chAlu nI tOTi sarasAlu bAva
ElE ElE maradalA
vAlE vAlE varasalA

gATapu gubbalu kadalaga kulikEvu
mATala tETala maradalA
vETari chUpulu visuruchU murisEvu
vATapu valapula varadalA
chITiki mATiki chanakEvu
chITiki mATiki chanakEvu
vaTTi bUTakAlu mAni pOvE bAva
chAlu chAlu nItOTi
aha chAlu nI tOTi sarasAlu bAva

ElE ElE maradalA
vAlE vAlE varasalA
nachchiMdi nachchiMdi nAjUku
nIkE istA sOkulu
ichchEyi pachchAru sogasulu
chAlu nI tOTi
aha chAlu nI tOTi sarasAlu bAva
ElE ElE maradalA
vAlE vAlE varasalA

kannula gaMTapu kavitalu gilikEvu
nA eda chATuna maradalA
pADani pATala paiTalu saridEvu
pallavi padamula daruvulA
kaMTiki vaMTiki kalipEvu
kaMTiki vaMTiki kalipEvu
enni koMTe lIlAlaMTa kOlO bAva
aha pADukO pATa
jaMTa pADukunna pATa jajipUdOTa

ElE ElE maradalA
vAlE vAlE varasalA
nachchiMdi nachchiMdi nAjUku
nIkE istA sOkulu
ichchEyi pachchAru sogasulu
chAlu nI tOTi
aha chAlu nI tOTi sarasAlu bAva
ElE ElE maradalA
vAlE vAlE varasalA
ElE ElE maradalA
vAlE vAlE varasalA



Asmadiya magatini

అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారె భంగా
వలపే ఇటు దులిపే చెలి వయ్యారంగా
కథలే ఇక నడిపే కడు శృంగారంగా
పెనుగొండ ఎదనిండా రగిలింది వెన్నెల హలా..
అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారె భంగా
ఆ..రంగరించు సంగమాలు భంగ భంగారె భంగా

సాపమ సామగ సాగసనిపస
సాపమ సామగ సపమ గమమ మపని పసనిస

నీపని నీ చాటు పని
రసలీల లాడుకున్న రాజసాల పని
మా పని అందాల పని
ఘన సాళ్వవంశ రసికరాజు కోరు పని
ఎపుడెపుడని ఎద ఎద కలిపే ఆపని
రేపని మరి మాపని క్షణమాపని మాపని
ప ప ప పని
ప ని స గ స ని పని
మ మ మ మని మపని
ఆ పని ఎదో ఇపుడే తెలుపని వలపని

అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారె భంగా..ఆ..

ఓ సఖి నాకేందుముఖి
ముద్దులాడు యుద్ధరంగాన ముఖాముఖి
ఓ సఖా మదనుని జనకా
ఈ సందిట కుదరాలి మనకు సంధి ఇక
ఋతువునకొక రుచి మరిగిన మనసయ్యాటకి
మాటికి మొగమాటపు సగమాటలు యేటికి
ప ప ప పని
ప ని స గ స ని పని
మ మ మ మని మపని
పెళ్ళికి పల్లకి తెచ్చే వరసకి వయసుకి

అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారె భంగా
ఆ..రంగరించు సంగమాలు భంగ భంగారె భంగా




asmadIya magaTimi tasmadIya takadhimi
raMgariMchu saMgamAlu bhaMga bhaMgAre bhaMgA
valapE iTu dulipE cheli vayyAraMgA
kathalE ika naDipE kaDu SRMgAraMgA
penugoMDa edaniMDA ragiliMdi vennela halA..
asmadIya magaTimi tasmadIya takadhimi
raMgariMchu saMgamAlu bhaMga bhaMgAre bhaMgA
A..raMgariMchu saMgamAlu bhaMga bhaMgAre bhaMgA

sApama sAmaga sAgasanipasa
sApama sAmaga sapama gamama mapani pasanisa

nIpani nI chATu pani
rasalIla lADukunna rAjasAla pani
mA pani aMdAla pani
ghana sALvavaMSa rasikarAju kOru pani
epuDepuDani eda eda kalipE Apani
rEpani mari mApani kshaNamApani mApani
pa pa pa pani
pa ni sa ga sa ni pani
ma ma ma mani mapani
A pani edO ipuDE telupani valapani

asmadIya magaTimi tasmadIya takadhimi
raMgariMchu saMgamAlu bhaMga bhaMgAre bhaMgA..A..

O sakhi nAkEMdumukhi
muddulADu yuddharaMgAna mukhAmukhi
O sakhA madanuni janakA
I saMdiTa kudarAli manaku saMdhi ika
Rtuvunakoka ruchi marigina manasayyATaki
mATiki mogamATapu sagamATalu yETiki
pa pa pa pani
pa ni sa ga sa ni pani
ma ma ma mani mapani
peLLiki pallaki techchE varasaki vayasuki

asmadIya magaTimi tasmadIya takadhimi
raMgariMchu saMgamAlu bhaMga bhaMgAre bhaMgA
A..rMgariMchu saMgamAlu bhaMga bhaMgAre bhaMgA



Govindasritha gokula

గోవిందాశ్రిత గోకుల బృందా
పావన జయజయ పరమానంద
గోవిందాశ్రిత గోకుల బృందా
పావన జయజయ పరమానంద ఆ..ఆ..

హరినామమే కడు ఆనందకరము
మరుగవో మరుగవో మరుగవో మనసా
హరినామమే కడు ఆనందకరము
మరుగవో మరుగవో మరుగవో మనసా
హరినామమే కడు ఆనందకరము
రంగా రంగా రంగపతి రంగనాథా
నీ సింగరాలె తరచాయ శ్రీరంగనాథ
రంగ రంగ రంగపతి రంగనాథా
నీ సింగరాలె తరచాయ శ్రీరంగనాథ
రంగనాధా శ్రీరంగనాథా
రంగనాధా శ్రీరంగనాథా

రాముడు రాఘవుడు రవికులుడితడు
భూమిజకు పతియైన పురుష నిధానము
రాముడు రాఘవుడు రవికులుడితడు
భూమిజకు పతియైన పురుష నిధానము
రాముడు రాఘవుడు రవికులుడితడు
రాం రాం సితారాం రాం రాం సితారాం
రాం రాం సితారాం రాం రాం సితారాం

పెరిగిననాడు చూడరో పెద్ద హనుమంతుడు
పెరిగిననాడు చూడరో పెద్ద హనుమంతుడు
పరగి నానా విద్యల బలవంతుడు
పెరిగిననాడు చూడరో పెద్ద హనుమంతుడు

వేదములు సుతింపగ వేడుకలు దైవారగ
ఆదరించి దాసుల మోహన నరసింహుడు
మోహన నరసింహుడు మోహన నరసింహుడు

చక్కని తల్లికి చాంగుభళా
తన చక్కెర మొవికి చాంగుభళా
చక్కని తల్లికి చాంగుభళా
తన చక్కెర మొవికి చాంగుభళా
చక్కని తల్లికి చాంగుభళా
చక్కని తల్లికి చాంగుభళా

కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
తెట్టెలాయె మహీమలే తిరుమల కొండ తిరుమల కొండ
కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
తేట్టెలాయే మహీమలే తిరుమల కొండ తిరుమల కొండ
తిరుమల కొండ తిరుమల కొండ

తిరువీధుల మెరసె ఈ దేవ దేవుడు
తిరువీధుల మెరసె ఈ దేవ దేవుడు
గరిమల మించిన సింగారముల తోడను
తిరువీధుల మెరసె ఈ దేవ దేవుడు దేవ దేవుడు

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
తందనానా ఆహి తందనానా పురె
తందనానా భళా తందనానా
పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
భళా తనదననా భళా తనదనానా

నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే
అండనే బంటు నిద్ర అదియూనొకటే
మెండైన బ్రహ్మణుడు మెట్టుభూమి యొకటే
మెండైన బ్రహ్మణుడు మెట్టుభూమి యొకటే
చండాలుడుండేటి సరి భూమి యొకటే

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే

కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే
పుడమి శునకము మీద పొలయు ఎండొకటే
కడుపుణ్యులను పాపకర్ములను సరిగావ
జడియు శ్రీవేంకటేశ్వరు నామమొక్కటే
కడుపుణ్యలను పాపకర్ములను సరిగావ
జడియు శ్రీవేంకటేశ్వరు నామమొక్కటే

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
తందనానా ఆహి తందనానా పురె
తందనానా భళా తందనానా
పర బ్రహ్మమొక్కటే భళా తందనానా
పర బ్రహ్మమొక్కటే భళా తందనానా
పర బ్రహ్మమొక్కటే భళా తందనానా




gOviMdASrita gOkula bRMdA
pAvana jayajaya paramAnaMda
gOviMdASrita gOkula bRMdA
pAvana jayajaya paramAnaMda A..A..

harinAmamE kaDu AnaMdakaramu
marugavO marugavO marugavO manasA
harinAmamE kaDu AnaMdakaramu
marugavO marugavO marugavO manasA
harinAmamE kaDu AnaMdakaramu
raMgA raMgA raMgapati raMganAthA
nI siMgarAle tarachAya SrIraMganAtha
raMga raMga raMgapati raMganAthA
nI siMgarAle tarachAya SrIraMganAtha
raMganAdhA SrIraMganAthA
raMganAdhA SrIraMganAthA

rAmuDu rAghavuDu ravikuluDitaDu
bhUmijaku patiyaina purusha nidhAnamu
rAmuDu rAghavuDu ravikuluDitaDu
bhUmijaku patiyaina purusha nidhAnamu
rAmuDu rAghavuDu ravikuluDitaDu
rAM rAM sitArAM rAM rAM sitArAM
rAM rAM sitArAM rAM rAM sitArAM

periginanADu chUDarO pedda hanumaMtuDu
periginanADu chUDarO pedda hanumaMtuDu
paragi nAnA vidyala balavaMtuDu
periginanADu chUDarO pedda hanumaMtuDu

vEdamulu sutiMpaga vEDukalu daivAraga
AdariMchi dAsula mOhana narasiMhuDu
mOhana narasiMhuDu mOhana narasiMhuDu

chakkani talliki chAMgubhaLA
tana chakkera moviki chAMgubhaLA
chakkani talliki chAMgubhaLA
tana chakkera moviki chAMgubhaLA
chakkani talliki chAMgubhaLA
chakkani talliki chAMgubhaLA

kaTTedura vaikuMThamu kANAchayina koMDa
teTTelAye mahImalE tirumala koMDa tirumala koMDa
kaTTedura vaikuMThamu kANAchayina koMDa
tETTelAyE mahImalE tirumala koMDa tirumala koMDa
tirumala koMDa tirumala koMDa

tiruvIdhula merase I dEva dEvuDu
tiruvIdhula merase I dEva dEvuDu
garimala miMchina siMgAramula tODanu
tiruvIdhula merase I dEva dEvuDu dEva dEvuDu

brahmamokkaTE para brahmamokkaTE
brahmamokkaTE para brahmamokkaTE
para brahmamokkaTE para brahmamokkaTE
taMdanAnA Ahi taMdanAnA pure
taMdanAnA bhaLA taMdanAnA
para brahmamokkaTE para brahmamokkaTE
bhaLA tanadananA bhaLA tanadanAnA

niMDAra rAju nidriMchu nidrayunokaTE
aMDanE baMTu nidra adiyUnokaTE
meMDaina brahmaNuDu meTTubhUmi yokaTE
meMDaina brahmaNuDu meTTubhUmi yokaTE
chaMDAluDuMDETi sari bhUmi yokaTE

brahmamokkaTE para brahmamokkaTE
para brahmamokkaTE para brahmamokkaTE

kaDagi Enugu mIda kAyu eMDokaTE
puDami Sunakamu mIda polayu eMDokaTE
kaDupuNyulanu pApakarmulanu sarigAva
jaDiyu SrIvEMkaTESvaru nAmamokkaTE
kaDupuNyalanu pApakarmulanu sarigAva
jaDiyu SrIvEMkaTESvaru nAmamokkaTE

brahmamokkaTE para brahmamokkaTE
para brahmamokkaTE para brahmamokkaTE
taMdanAnA Ahi taMdanAnA pure
taMdanAnA bhaLA taMdanAnA
para brahmamokkaTE bhaLA taMdanAnA
para brahmamokkaTE bhaLA taMdanAnA
para brahmamokkaTE bhaLA taMdanAnA



Padaharu kalalaku

ఓం శ్రీపద్మావతీ భూదేవీ సమేతస్య
శ్రీమద్వేంకట నాయకస్య
నిత్య షోడసోపచార పూజాంకరిష్యే
ఆవాహయామి
పదహారు కళలకు ప్రాణాలైన
నా ప్రణవ ప్రణయ దేవతలకు ఆవాహనం

ఓం ఆసనం సమర్పయామి
పరువాల హోయలకు పైయెదలైన
నా ఊహల లలనకు ఊరువుల ఆసనం

ఓం స్నానం సమర్పయామి
చిత్తడి చిరు చెమటల చిందులు చిలికే
పద్మినీ భామినులకు పన్నీటి స్నానం

ఓం గంధం సమర్పయామి
ఘలం ఘలల నడల వలన అలసిన
మీ గగన జఘన సొభగులకు శీతల గంధం

ఓం నైవేద్యం సమర్పయామి
రతివేద వేద్యులైన రమణులకు
అనుభవైక వేద్యమైన నైవేద్యం

ఓం తాంబూలం సమర్పయామి
మీ తహతహలకు తపనలకు తాకిళ్ళకు
ఈ కొసరు కొసరు తాంబూలం

ఓం సాష్టాంగ వందనం సమర్పయామి
అనంద రంగ భంగిణులకు సర్వాంగ చుంబనాల వందనం




OM SrIpadmAvatI bhUdEvI samEtasya
SrImadvEMkaTa nAyakasya
nitya shODasOpachAra pUjAMkarishyE
AvAhayAmi
padahAru kaLalaku prANAlaina
nA praNava praNaya dEvatalaku AvAhanaM

OM AsanaM samarpayAmi
paruvAla hOyalaku paiyedalaina
nA Uhala lalanaku Uruvula AsanaM

OM snAnaM samarpayAmi
chittaDi chiru chemaTala chiMdulu chilikE
padminI bhAminulaku pannITi snAnaM

OM gaMdhaM samarpayAmi
ghalaM ghalala naDala valana alasina
mI gagana jaghana sobhagulaku SItala gaMdhaM

OM naivEdyaM samarpayAmi
rativEda vEdyulaina ramaNulaku
anubhavaika vEdyamaina naivEdyaM

OM tAMbUlaM samarpayAmi
mI tahatahalaku tapanalaku tAkiLLaku
I kosaru kosaru tAMbUlaM

OM sAshTAMga vaMdanaM samarpayAmi
anaMda raMga bhaMgiNulaku sarvAMga chuMbanAla vaMdanaM



Pala netranala

పాలనేత్రానల ప్రబల విధ్యుల్లతా కేళీ విహార
లక్ష్మినారసింహ లక్ష్మినారసింహ
ప్రళయ మారుత ఘోర భస్త్రిక పుత్కార
లలిత నిశ్వాస దోలారచనయా
కులశైల కుంభుని కుముదహిత రవిగగన
చలననిధి నిపుణ నిశ్చల నారసింహ నిశ్చల నారసింహ
దారుణోజ్వల ధగద్ధగీత దంష్టానల వికార స్పులింగ సంగక్రిడయా
వైరి దానవి ఘోర వంశ భస్మీకరణ
కారణ ప్రకట వేంకట నారసింహ
వేంకట నారసింహ వెంకట నారసింహ




pAlanEtrAnala prabala vidhyullatA kELI vihAra
lakshminArasiMha lakshminArasiMha
praLaya mAruta ghOra bhastrika putkAra
lalita niSvAsa dOlArachanayA
kulaSaila kuMbhuni kumudahita ravigagana
chalananidhi nipuNa niSchala nArasiMha niSchala nArasiMha
dAruNOjvala dhagaddhagIta daMshTAnala vikAra spuliMga saMgakriDayA
vairi dAnavi ghOra vaMSa bhasmIkaraNa
kAraNa prakaTa vEMkaTa nArasiMha
vEMkaTa nArasiMha veMkaTa nArasiMha



Brahma kadigina padamu

బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానె నీ పాదము
బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానె నీ పాదము
బ్రహ్మ కడిగిన పాదము

చెలగి వసుధ గొలిచిన నీ పాదము
బలితల మోపిన పాదము
తలకగ గగనము తన్నిన పాదము
తలకగ గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము
బ్రహ్మ కడిగిన పాదము

పరమయోగులకు పరిపరి విధముల వరమొసగెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన పరమ పదము నీ పాదము
బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానె నీ పాదము
బ్రహ్మ కడిగిన పాదము




brahma kaDigina pAdamu brahmamu tAne nI pAdamu
brahma kaDigina pAdamu brahmamu tAne nI pAdamu
brahma kaDigina pAdamu

chelagi vasudha golichina nI pAdamu
balitala mOpina pAdamu
talakaga gaganamu tannina pAdamu
talakaga gaganamu tannina pAdamu
balaripu gAchina pAdamu
brahma kaDigina pAdamu

paramayOgulaku paripari vidhamula varamosageDi nI pAdamu
tiruvEMkaTagiri tiramani chUpina parama padamu nI pAdamu
brahma kaDigina pAdamu brahmamu tAne nI pAdamu
brahma kaDigina pAdamu



Sobhaname sobhaname

శోభనమే శోభనమే శోభనమే శోభనమే
వైభవముల పావనమూర్తికి
శోభనమే శోభనమే శోభనమే శోభనమే
వైభవముల పావనమూర్తికి
శోభనమే శోభనమే

దేవదానవుల ధీరతను ధావతిపడి వార్ధీతరువుగను
దేవదానవుల ధీరతను ధావతిపడి వార్ధీతరువుగను
శ్రీవనితామణి చెలగి పెండ్లాడిన శ్రీవేంకటగిరి శ్రీనిధికి

శోభనమే శోభనమే శోభనమే శోభనమే
వైభవముల పావనమూర్తికి
శోభనమే శోభనమే శోభనమే శోభనమే
వైభవముల పావనమూర్తికి
శోభనమే శోభనమే శోభనమే శోభనమే




SObhanamE SObhanamE SObhanamE SObhanamE
vaibhavamula pAvanamUrtiki
SObhanamE SObhanamE SObhanamE SObhanamE
vaibhavamula pAvanamUrtiki
SObhanamE SObhanamE

dEvadAnavula dhIratanu dhAvatipaDi vArdhItaruvuganu
dEvadAnavula dhIratanu dhAvatipaDi vArdhItaruvuganu
SrIvanitAmaNi chelagi peMDlADina SrIvEMkaTagiri SrInidhiki

SObhanamE SObhanamE SObhanamE SObhanamE
vaibhavamula pAvanamUrtiki
SObhanamE SObhanamE SObhanamE SObhanamE
vaibhavamula pAvanamUrtiki
SObhanamE SObhanamE SObhanamE SObhanamE



Nanati bathuku natakamu

నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము
నానాటి బతుకు నాటకము నాటకము

పుట్టుటయు నిజము పోవుటయు నిజము
నట్టనడిమి పని నాటకము
ఎట్టనెదుట గలది ప్రపంచము
కట్ట కడపటిది కైవల్యము




nAnATi batuku nATakamu kAnaka kannadi kaivalyamu
nAnATi batuku nATakamu nATakamu

puTTuTayu nijamu pOvuTayu nijamu
naTTanaDimi pani nATakamu
eTTaneduTa galadi prapaMchamu
kaTTa kaDapaTidi kaivalyamu



Kondalalo nelakonna

ఆ..ఆ..ఆ...
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడు వాడు
కొండలంత వరములు గుప్పెడు వాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడు వాడు
కొండలలో నెలకొన్న ఆ..ఆ...
కొండలలో నెలకొన్న ఆ..ఆ...
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు




A..A..A...
koMDalalO nelakonna kOnETi rAyaDu vADu
koMDalalO nelakonna kOnETi rAyaDu vADu
koMDalaMta varamulu guppeDu vADu
koMDalaMta varamulu guppeDu vADu
koMDalalO nelakonna kOnETi rAyaDu vADu
koMDalaMta varamulu guppeDu vADu
koMDalalO nelakonna A..A...
koMDalalO nelakonna A..A...
koMDalalO nelakonna kOnETi rAyaDu vADu



Dachuko nee padalaku

దాచుకో నీ పాదాలకు తగ నే చేసిన పూజలివి
పూచి నీ కీరిటి రూప పుష్పములివె అయ్యా
దాచుకో దాచుకో దాచుకో



dAchukO nI pAdAlaku taga nE chEsina pUjalivi
pUchi nI kIriTi rUpa pushpamulive ayyA
dAchukO dAchukO dAchukO



My Blog List

Blog Archive