Showing posts with label Ala Modalaindi. Show all posts
Showing posts with label Ala Modalaindi. Show all posts

Apr 2, 2013

Ammammo ammo

అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే అందంతో అల్లే వల
అబ్బబ్బో అబ్బో అబ్బాయి అంటే మాటల్లో ముంచే అల
కవ్వించే నవ్వే పువ్వై పూసినా గుండెల్లో ముళ్ళై తాకగా
ఊహల్లో ఎన్నో ఎన్నో పంచినా చేతల్లో అన్నీ అందునా
అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే అందంతో అల్లే వల

ఆహా ఏం కన్నులు ఓహో ఏం చూపులు
అవి కావా మా ఆస్తులు
మ్మ్.. ప్రేమించక ముందరే ఈ తియ్యని కవితలు
తర్వాత అవి కసురులు
అన్నీ వింటూ ఆనందిస్తూ ఆపైన I'm sorry అంటారు
చుట్టూ చుట్టూ తిప్పుకుంటూ సింపుల్‌గా No అందురు

అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే అందంతో అల్లే వల

కన్నీటి బాణమే వేసేటి విద్యలో
ముందుంది మీరే కదా
హే.. మౌనాన్నే కంచెగా మలిచేటి కోర్సులో
distinction మీదే కదా
కన్నీరైనా మౌనం అయినా చెప్పేది నిజమేలే ప్రతిరోజు
అంతే కాని అరచేతుల్లో ఆకాశం చూపించకు

అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే అందంతో అల్లే వల
కవ్వించే నవ్వే పువ్వై పూసినా గుండెల్లో ముళ్ళై తాకగా
ఊహల్లో ఎన్నో ఎన్నో పంచినా చేతల్లో అన్నీ అందునా
నానన్నా ననా...




ammammO ammO ammAyi anTE andamtO allE vala
abbabbO abbO abbAyi anTE mATallO muncE ala
kavvincE navvE puvvai pUsinA gunDellO muLLai tAkagA
UhallO ennO ennO pancinA cEtallO annI andunA
ammammO ammO ammAyi anTE andamtO allE vala

AhA Em kannulu OhO Em cUpulu
avi kAvA mA Astulu
mm.. prEmincaka mundarE I tiyyani kavitalu
tarvAta avi kasurulu
annI vinTU AnandistU Apaina I'm sorry anTAru
cuTTU cuTTU tippukunTU simpulgA No anduru

ammammO ammO ammAyi anTE andamtO allE vala

kannITi bANamE vEsETi vidyalO
mundundi mIrE kadA
hE.. mounAnnE kancegA malicETi kOrsulO
distinction mIdE kadA
kannIrainA mounam ayinA ceppEdi nijamElE pratirOju
antE kAni aracEtullO AkASam cUpincaku

ammammO ammO ammAyi anTE andamtO allE vala
kavvincE navvE puvvai pUsinA gunDellO muLLai tAkagA
UhallO ennO ennO pancinA cEtallO annI andunA
nAnannA nanA...



Edo Anukunte

ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే
నాకే అనుకుంటే అది నీకూ జరిగిందే
సర్లే గగ్గోలు పెట్టకే అంతా మన లైఫు మంచికే
మందుంది మనసు బాధకి వదిలేద్దాం కథని కంచికే
అసలీ ప్రేమ దోమ ఎందుకు tell me why
ఎవరిష్టం వాళ్ళది మనకెందుకు వదిలేయ్
ఏయ్ ప్రేమ దోమ ఎందుకు tell me why
ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే
నాకే అనుకుంటే అది నీకూ జరిగిందే

మ్మ్..ప్రేమించినా మ్మ్..పెళ్ళాడకు
వైఫొక్కటే తోడెందుకు
మ్మ్..మగ వాళ్ళని మ్మ్..టైం పాసని
అనుకుంటూ వెంట తిరగనీ
మన ఖర్చే వాళ్ళు పెట్టనీ
ఆ పైన వాళ్ళ ఖర్మ పోనీ
మరి పెళ్ళి గిల్లి ఎందుకు tell me why
అది బుర్రే లేని వాళ్ళకి వదిలేసేయ్
మరి పెళ్ళి గిల్లి ఎందుకు tell me why

ఆ..నువ్వొక్కడే మ్మ్..పుట్టావురా
నువ్వొక్కడే పోతావురా
మ్మ్..ఆ మధ్యలో మ్మ్..బతకాలిగా
ఆరడుగుల పెళ్ళి గొయ్యికి ఏడడుగుల తొందరెందుకు
సూసైడు నేడు ముద్దు మనకి
మరి లైఫూ గీఫూ ఎందుకు tell me why
నువ్ మళ్ళీ మళ్ళీ మొదలెట్టకు వదిలేయ్
ఏయ్ ప్రేమ దోమ ఎందుకు tell me why




EdO anukunTE inkEdO ayyindE
nAkE anukunTE adi nIkU jarigindE
sarlE gaggOlu peTTakE antA mana laifu mancikE
mandundi manasu bAdhaki vadilEddAm kathani kancikE
asalI prEma dOma enduku tell me why
evarishTam vALLadi manakenduku vadilEy
Ey prEma dOma enduku tell me why
EdO anukunTE inkEdO ayyindE
nAkE anukunTE adi nIkU jarigindE

mm..prEmincinA mm..peLLADaku
waifokkaTE tODenduku
mm..maga vALLani mm..Taim pAsani
anukunTU venTa tiraganI
mana kharcE vALLu peTTanI
A paina vALLa kharma pOnI
mari peLLi gilli enduku tell me why
adi burrE lEni vALLaki vadilEsEy
mari peLLi gilli enduku tell me why

A..nuvvokkaDE mm..puTTAvurA
nuvvokkaDE pOtAvurA
mm..A madhyalO mm..batakAligA
AraDugula peLLi goyyiki EDaDugula tondarenduku
sUsaiDu nEDu muddu manaki
mari laifU gIfU enduku tell me why
nuv maLLI maLLI modaleTTaku vadilEy
Ey prEma dOma enduku tell me why



Innallu Naa Kallu

ఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు నన్ను వువ్వు చూస్తుంటే
చూపుల్లో ఇలాంటి ప్రేమ దాగి ఉందని
ఎలా ఎలా క్షణాలనే వెనక్కి రప్పించడం
ఎలా ఎలా గతాలనే ఇవ్వాళగా మార్చడం
ఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు నన్ను వువ్వు చూస్తుంటే
చూపుల్లో ఇలాంటి ప్రేమ దాగి ఉందని

చివరిదాకా చెలిమి పంచే చిలిపితనమే నీవని
మనసు దాకా చేరగలిగే మొదటి పిలుపే నీదని
తెలియకుండా ఇంత కాలం ఏమి చేశానో
తెలుసుకున్న వేళలోన దూరమెంతుందో ఇలా...

ఎవరు చేరి తీర్చగలరు మనసులోని లోటుని
ఎవరు మాత్రం చూపగలరు వెలుగు నింపే తోడుని
ఎదురు చూస్తూ ఉండిపోనా నేను ఇక పైన
జ్ఞాపకాన్నై మిగిలిపోనా ఎన్నినాళ్ళైనా ఇలా...




innALLu nA kaLLu grahincalEdu nannu vuvvu cUstunTE
cUpullO ilAnTi prEma dAgi undani
elA elA kshaNAlanE venakki rappincaDam
elA elA gatAlanE ivvALagA mArcaDam
innALLu nA kaLLu grahincalEdu nannu vuvvu cUstunTE
cUpullO ilAnTi prEma dAgi undani

civaridAkA celimi pancE cilipitanamE nIvani
manasu dAkA cEragaligE modaTi pilupE nIdani
teliyakunDA inta kAlam Emi cESAnO
telusukunna vELalOna dUramentundO ilA...

evaru cEri tIrcagalaru manasulOni lOTuni
evaru mAtram cUpagalaru velugu nimpE tODuni
eduru cUstU unDipOnA nEnu ika paina
j~nApakAnnai migilipOnA enninALLainA ilA...



Cheli vinamani

చెలీ వినమని చెప్పాలి మనసులో తలపుని
మరీవాళే త్వరపడనా మరో ముహూర్తం కనబడునా
ఇది ఎపుడో మొదలైందనీ అది ఇప్పుడే తెలిసిందనీ

తనక్కూడా ఎంతో కొంత ఇదే భావం ఉండుంటుందా
కనుక్కుంటే బాగుంటుందేమో
అడగ్గానే అవునంటుందా అభిప్రాయం లేదంటుందా
విసుక్కుంటూ పొమ్మంటుందేమో
మందార పువ్వులా కందిపోయి ఛీ ఆంటే సిగ్గనుకుంటాం కానీ
సందేహం తీరక ముందుకెళితే మర్యాదకెంతో హాని
ఇది ఎపుడో మొదలైందనీ అది ఇప్పుడే తెలిసిందనీ

పిలుస్తున్నా వినపణ్ణట్టు పరాగ్గా నేనున్నానంటూ
చిరాగ్గా చినబోతుందో ఏమో
ప్రపంచంతో పన్లేనట్టు తదేకంగా చూస్తున్నట్టు
రహస్యం కనిపెట్టేస్తుందేమో
అమ్మాయి పేరులో మాయ మైకం ఏ లోకం చూపిస్తుందో గానీ
వయ్యారి ఊహలో వాయువేగం మేఘాలు దిగి రానంది
ఇది ఎపుడో మొదలైందనీ అది ఇప్పుడే తెలిసిందనీ




chelI vinamani cheppAli manasulO talapuni
marIvALE tvarapaDanA marO muhUrtaM kanabaDunA
idi epuDO modalaiMdanI adi ippuDE telisiMdanI

tanakkUDA eMtO koMta idE bhAvaM uMDuMTuMdA
kanukkuMTE bAguMTuMdEmO
aDaggAnE avunaMTuMdA abhiprAyaM lEdaMTuMdA
visukkuMTU pommaMTuMdEmO
maMdAra puvvulA kaMdipOyi ChI AMTE sigganukuMTAM kAnI
saMdEhaM tIraka muMdukeLitE maryAdakeMtO hAni
idi epuDO modalaiMdanI adi ippuDE telisiMdanI

pilustunnA vinapaNNaTTu parAggA nEnunnAnaMTU
chirAggA chinabOtuMdO EmO
prapaMchaMtO panlEnaTTu tadEkaMgA chUstunnaTTu
rahasyaM kanipeTTEstuMdEmO
ammAyi pErulO mAya maikaM E lOkaM chUpistuMdO gAnI
vayyAri UhalO vAyuvEgaM mEghAlu digi rAnaMdi
idi epuDO modalaiMdanI adi ippuDE telisiMdanI



My Blog List

Blog Archive