Showing posts with label Golkonda High School. Show all posts
Showing posts with label Golkonda High School. Show all posts

Apr 2, 2013

Enativo ragalu

ఏనాటివో రాగాలు ఈనాటికీ తోచేనా
వెంటాడి లాలించేది లోలోన శోధించేది
ఊరించి పాడించేనో..హోహొ..
కాసేపు బాధించేది కాసింత సాధించేది
ఏ వింత చుపించేనో..హో..
తలచే వేళ తోడుండేది కలలోలైనా కోరేది
మురిపించేది మోహించేది మరుపే రాని స్నేహాలు
ఆ రోజులే రావాలి ఆ మోజులే తీరాలి
ఏ మూల దాగున్నదో ఏ దారి రానున్నదో
ఏమేమి తేనున్నాయో..హోహొ..
పాఠాలు చెప్పించేను పంతాలు చెల్లించేను
పైపైకి రప్పించేనో..హో..
ఉడికించేది ఓదార్చేది నడిపించేది నేర్పేది
ఉరికించేది ఎక్కించేది బతికించేది నచ్చేది
ఆ రోజులే రావాలి..మ్మ్..




EnATivO rAgAlu InATikI tOcEnA
venTADi lAlincEdi lOlOna SOdhincEdi
Urinci pADincEnO..hOho..
kAsEpu bAdhincEdi kAsinta sAdhincEdi
E vinta cupincEnO..hO..
talacE vELa tODunDEdi kalalOlainA kOrEdi
muripincEdi mOhincEdi marupE rAni snEhAlu
A rOjulE rAvAli A mOjulE tIrAli
E mUla dAgunnadO E dAri rAnunnadO
EmEmi tEnunnAyO..hOho..
pAThAlu ceppincEnu pantAlu cellincEnu
paipaiki rappincEnO..hO..
uDikincEdi OdArcEdi naDipincEdi nErpEdi
urikincEdi ekkincEdi batikincEdi naccEdi
A rOjulE rAvAli..mm..



Idi adenemo

ఇది అదేనేమో అలాగే ఉందే
తెలుసునో లేదో తెలీడం లేదే
ఫలనా అని అనుకోమని
ఏ రోజు చెబుతుందో ఏమో
ఇది అదేనేమో అలాగే ఉందే
తెలుసునో లేదో తెలీడం లేదే
ఫలనా అని అనుకోమని
ఏ రోజు చెబుతుందో ఏమో
ఇది అదేనేమో అలాగే ఉందే

మొగవాళ్ళక్కూడా ఇంత మొహమాటముంటుందా
అనుకోనేలేదే ఏనాడు
బిడియానిక్కూడా ఇంత దుడుకొచ్చే తుళ్ళింత
బహుశా నీ వల్లే ఈనాడు
అవకాశం ఇస్తున్నా అడిగేసే వీలున్నా
అనుమానం ఆపింది అనేందుకు
కుడి కొంచం ఎడమైనా మనలో ఏ ఒకరైనా
అనుకుందాం అవునో కాదో
ఫలనా అని అనుకోమని
ఏ రోజు చెబుతుందో ఏమో

ఇది అదేనేమో తెలీడం లేదే

ఏకాంతం ఎరుపెక్కేలా అంతిదిగా చూడాలా
నీతో మాకష్టం మాస్టారు
చలిగాలికి చెమటట్టేలా కవ్విస్తూ నవ్వాలా
ఉడికిస్తూ ఉందే నీ తీరు
ఇదివర్లా ఉండాలో ఇంకోలా మారాలో
తీ తీయని ఇబ్బంది ఇదేవిటో
దూరంగా ఆగాలో దగ్గరగా చేరాలో
ఏమి చేస్తే బాగుంటుందో
ఫలనా అని అనుకోమని
ఏ రోజు చెబుతుందో ఏమో

ఇది అదేనేమో అలాగే ఉందే
తెలుసునో లేదో తెలీడం లేదే
ఫలనా అని అనుకోమని
ఏ రోజు చెబుతుందో ఏమో




idi adEnEmO alAgE uMdE
telusunO lEdO telIDaM lEdE
phalanA ani anukOmani
E rOju chebutuMdO EmO
idi adEnEmO alAgE uMdE
telusunO lEdO telIDaM lEdE
phalanA ani anukOmani
E rOju chebutuMdO EmO
idi adEnEmO alAgE uMdE

mogavALLakkUDA iMta mohamATamuMTuMdA
anukOnElEdE EnADu
biDiyAnikkUDA iMta duDukochchE tuLLiMta
bahuSA nI vallE InADu
avakASaM istunnA aDigEsE vIlunnA
anumAnaM ApiMdi anEMduku
kuDi koMchaM eDamainA manalO E okarainA
anukuMdAM avunO kAdO
phalanA ani anukOmani
E rOju chebutuMdO EmO

idi adEnEmO telIDam lEdE

EkAMtaM erupekkElA aMtidigA chUDAlA
nItO mAkashTaM mAsTAru
chaligAliki chemaTaTTElA kavvistU navvAlA
uDikistU uMdE nI tIru
idivarlA uMDAlO iMkOlA mArAlO
tI tIyani ibbaMdi idEviTO
dUraMgA AgAlO daggaragA chErAlO
Emi chEstE bAguMTuMdO
phalanA ani anukOmani
E rOju chebutuMdO EmO

idi adEnEmO alAgE uMdE
telusunO lEdO telIDaM lEdE
phalanA ani anukOmani
E rOju chebutuMdO EmO



Adugeste

అడుగేస్తే అందే దూరంలో హలో
అదిగో ఆ తారాతీరంలో చలో
అటు చూడు ఎంత తళుకో
అది వచ్చి వాలెననుకో
కనులింట ఎంత వెలుగో చూసుకో
ఇది నేటి ఆదమరుపో మరునాటి మేలుకొలుపో
వెనువెంట వెళ్ళి ఇపుడే తేల్చుకో
అడుగేస్తే అందే దూరంలో హలో

కొండంత భారం కూడా తేలిగ్గా అనిపిస్తుంది
గుండెల్లో సందేహలేం లేకుంటే
గండాలు సుడిగుండాలు ఉండే ఉంటాయి అనుకుంటే
సంద్రంలో సాగే నావ నాట్యం చేస్తునట్టుంటుందే
ధీమగా పోతుంటే ఏ మార్గం నిన్ను ఏనాడు ఆపదని
సరదాగా దూసుకెళ్ళిపో కడదాక ఆగననుకో
కలగన్న రేపునిపుడే కలుసుకో

ఉత్సాహం పరుగులు తీస్తూ విశ్రాంతే వద్దనుకుంటే
ఆయాసం కూడా ఎంతో హాయేలే
పోరాటం కూడా ఏదో ఆటల్లే కనపడుతుంటే
గాయాలు గట్రా చాలా మాములే అనిపిస్తాయంతే
నీ గమ్యం ఎదైనా వెళ్ళాలే గాని రమ్మంటే రాదు కదా
ప్రతి పాట కొత్త మలుపే ప్రతి పూట ఆశ మెరుపే
ప్రతి చోట గెలుపు పిలుపే తెలుసుకో




aDugEstE aMdE dUraMlO halO
adigO A tArAtIraMlO chalO
aTu chUDu eMta taLukO
adi vachchi vAlenanukO
kanuliMTa eMta velugO chUsukO
idi nETi AdamarupO marunATi mElukolupO
venuveMTa veLLi ipuDE tElchukO
aDugEstE aMdE dUraMlO halO

koMDaMta bhAraM kUDA tEliggA anipistuMdi
guMDellO saMdEhalEm lEkuMTE
gaMDAlu suDiguMDAlu uMDE uMTAyi anukuMTE
saMdraMlO sAgE nAva nATyaM chEstunaTTuMTuMdE
dhImagA pOtuMTE E mArgaM ninnu EnADu Apadani
saradAgA dUsukeLLipO kaDadAka AgananukO
kalaganna rEpunipuDE kalusukO

utsAhaM parugulu tIstU viSrAMtE vaddanukunTE
AyAsaM kUDA eMtO hAyElE
pOrATaM kUDA EdO ATallE kanapaDutuMTE
gAyAlu gaTrA chAlA mAmulE anipistAyaMtE
nI gamyaM edainA veLLAlE gAni rammaMTE rAdu kadA
prati pATa kotta malupE prati pUTa ASa merupE
prati chOTa gelupu pilupE telusukO



Apr 1, 2013

Oka vithanam

ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా గమనించుదాం
నిలువెత్తుగా తల ఎత్తడం నేర్పేందుకదే తొలి పాఠం
మునివేళ్ళతో మేఘాలనే మీటేంతగా ఎదిగాం మనం
పసివాళ్ళలా ఈ మట్టిలో ఎన్నాళ్ళిలాగ పడి ఉంటాం
కునికే మన కనురెపల్లో వెలిగిద్దాం రంగుల స్వప్నం
ఇదిగో నీ దారిటు ఉందని సూరీడిని రా రమ్మందాం
జాగో జాగోరే జాగో జాగో జాగోరే జాగో
జాగో జాగోరే జాగో
జాగో జాగోరే జాగో జాగో జాగోరే జాగో
జాగో జాగోరే జాగో

ఆకాశం నుండి సూటిగా దూకేస్తే ఉన్నపాటుగా
ఎమౌతానంటూ చినుకలా ఆగిందా బెదురుగా
కనుకే ఆ చినుకు ఏరుగా ఆ ఏరే వరద హోరుగా
ఇంతింతై ఎదిగి అంతగా అంతెరుగని సంద్రమైందిగా
సందేహిస్తుంటే అతిగా సంకల్పం నెరవేరదుగా
ఆలోచన కన్నా త్వరగా అడుగేద్దాం ఆరంభంగా
జాగో జాగోరే జాగో జాగో జాగోరే జాగో
జాగో జాగోరే జాగో
జాగో జాగోరే జాగో జాగో జాగోరే జాగో
జాగో జాగోరే జాగో

ఏ పని మరీ ఆసాద్యమేం కాదే ఆ నిజం మహా రహస్యమా
వేసే పదం పదం పదే పదే పడదోసే సవాళ్ళనే ఎదుర్కోమ్మా
మొదలెట్టక ముందే ముగిసే కథ కాదే మన ఈ పయనం
సమరానికి సై అనగలిగే సంసిద్ధత పేరే విజయం
జాగో జాగోరే జాగో జాగో జాగోరే జాగో
జాగో జాగోరే జాగో
జాగో జాగోరే జాగో జాగో జాగోరే జాగో
జాగో జాగోరే జాగో




oka vittanaM molakettaDaM sarikottagA gamaniMchudAM
niluvettugA tala ettaDaM nErpEMdukadE toli pAThaM
munivELLatO mEghAlanE mITEMtagA edigAM manaM
pasivALLalA I maTTilO ennALLilAga paDi uMTAM
kunikE mana kanurepallO veligiddAM raMgula swapnaM
idigO nI dAriTu uMdani sUrIDini rA rammaMdAM
jAgO jAgOrE jAgO jAgO jAgOrE jAgO
jAgO jAgOrE jAgO
jAgO jAgOrE jAgO jAgO jAgOrE jAgO
jAgO jAgOrE jAgO

AkASaM nuMDi sUTigA dUkEstE unnapATugA
emautAnaMTU chinukalA AgiMdA bedurugA
kanukE A chinuku ErugA A ErE varada hOrugA
iMtiMtai edigi aMtagA aMterugani saMdramaiMdigA
saMdEhistuMTE atigA saMkalpaM neravEradugA
AlOchana kannA tvaragA aDugEddAM AraMbhaMgA
jAgO jAgOrE jAgO jAgO jAgOrE jAgO
jAgO jAgOrE jAgO
jAgO jAgOrE jAgO jAgO jAgOrE jAgO
jAgO jAgOrE jAgO

E pani marI AsAdyamEM kAdE A nijaM mahA rahasyamA
vEsE padaM padaM padE padE paDadOsE savALLanE edurkOmmA
modaleTTaka muMdE mugisE katha kAdE mana I payanaM
samarAniki sai anagaligE saMsiddhata pErE vijayaM
jAgO jAgOrE jAgO jAgO jAgOrE jAgO
jAgO jAgOrE jAgO
jAgO jAgOrE jAgO jAgO jAgOrE jAgO
jAgO jAgOrE jAgO



My Blog List

Blog Archive