Pages

Apr 6, 2013

Telugu padaniki

ఓం ఓం
తెలుగు పదానికి జన్మదినం
ఇది జాన పదానికి జ్ఞానపథం
ఏడు స్వరాలే ఏడు కొండలై
వెలసిన కలియుగ విష్ణు పదం
అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం

అరిషడ్వర్గము తెగనరికే హరిఖడ్గమ్మిది నందకము
బ్రహ్మలోకమున బ్రహ్మభారతి నాదాశీస్సులు పొందినదై
శివలోకమ్మున చిద్విలాసమున ఢమరుధ్వనిలో గమకితమై
దివ్యసభలలో నవ్యలాస్యముల పూబంతుల చేబంతిగా ఎగసి
నీరద మండల నారద తుంబుర మహతీ గానవు మహిమలు తెలిసి
సితహిమ కందర యతిరాట్సభలో తప: ఫలమ్ముగ తళుకుమని
తల్లి తనముకై తల్లడిల్లు ఆ లక్కమాంబ గర్భాలయమ్ములో
ప్రవేశించె ఆ నందకము నందనానంద కారకము

అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం

పద్మావతియే పురుడు పోయగా పధ్మాసనుడే ఉసురు పోయగా
విష్ణు తేజమై నాద బీజమై అంధ్ర సాహితి అమర కోశమై
అవతరించెను అన్నమయ్య అసతోమా సద్గమయ
అవతరించెను అన్నమయ్య అసతోమా సద్గమయ

పాపడుగా నట్టింట పాకుతూ భాగవతము చేపట్టెనయా
హరినామమ్మును ఆలకించక అరముద్దలనే ముట్టడయా
తెలుగు భారతికి వెలుగు హారతై ఎదలయలో పద కవితలు కలయ
తాళ్ళపాకలో ఎదిగె అన్నమయ్య తమసోమా జ్యోతిర్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
తమసోమా జ్యోతిర్గమయ




OM OM
telugu padAniki janmadinaM
idi jAna padAniki j~nAnapathaM
EDu swarAlE EDu koMDalai
velasina kaliyuga vishNu padaM
annamayya jananaM
idi annamayya jananaM
idi annamayya jananaM

arishaDvargamu teganarikE harikhaDgammidi naMdakamu
brahmalOkamuna brahmabhArati nAdASIssulu poMdinadai
SivalOkammuna chidvilAsamuna DhamarudhvanilO gamakitamai
divyasabhalalO navyalAsyamula pUbaMtula chEbaMtigA egasi
nIrada maMDala nArada tuMbura mahatI gAnavu mahimalu telisi
sitahima kaMdara yatirATsabhalO tapa: phalammuga taLukumani
talli tanamukai tallaDillu A lakkamAMba garbhAlayammulO
pravESiMche A naMdakamu naMdanAnaMda kArakamu

annamayya jananaM
idi annamayya jananaM
idi annamayya jananaM

padmAvatiyE puruDu pOyagA padhmAsanuDE usuru pOyagA
vishNu tEjamai nAda bIjamai aMdhra sAhiti amara kOSamai
avatariMchenu annamayya asatOmA sadgamaya
avatariMchenu annamayya asatOmA sadgamaya

pApaDugA naTTiMTa pAkutU bhAgavatamu chEpaTTenayA
harinAmammunu AlakiMchaka aramuddalanE muTTaDayA
telugu bhAratiki velugu hAratai edalayalO pada kavitalu kalaya
tALLapAkalO edige annamayya tamasOmA jyOtirgamaya
tamasOmA jyOtirgamaya
tamasOmA jyOtirgamaya



No comments:

Post a Comment

Have your say..