ఆడపిల్లలు అరె లేడి పిల్లలు
హంస నడక నేర్చుకున్న చేప పిల్లలు
ఆడపిల్లలు అరె లేడి పిల్లలు
హంస నడక నేర్చుకున్న చేప పిల్లలు
ఆ వాలు చూపులు విసిరేసి పాపలు
మగవారిలోన ప్రేమ చిచ్చు పెట్టి పోదురు
ఆడపిల్లలు అరె లేడి పిల్లలు
హంస నడక నేర్చుకున్న చేప పిల్లలు
నీలో నాలో మౌనం పెంచే పాటే కాదా ప్రేమ నిజంగా
ఆటా పాటా ప్రేమేనంటే అయ్యో పాపం కుర్రతనంగా
అందరికీ అందదుగా ప్రేమ సుధా
ఎందుకలా ప్రేమ వట్టి కట్టు కథ
లైలా మజ్ఞూల గాథే తెలుసుకదా
అయ్యో వారి కథ చివరకి వేరు కదా
మీకు మాకు దూరం తప్పదుగా
ఆడపిల్లలు అరె లేడి పిల్లలు
హంస నడక నేర్చుకున్న చేప పిల్లలు
ని స గ ని స మ
ని స గ రి స ని స
ని స గ స గ మ
గ మ ప ద ప మ గ మ గ రి స రి
ని స గ ని స మ
ని స గ రి స ని స
కళ్ళు కళ్ళు చదివే భాష ప్రేమేనయ్యో చూడు తమాషా
హల్లొ అంటే ప్రేమేనంట అయ్యో రామ ఇంత పరాకా
మనసులిలా ముడిపడని పెళ్ళి వృథా
పెళ్ళి తంతు జరిగేది పైన కదా
ప్రేమే పెళ్ళికిల పువ్వుల పల్లకిగా
తేడా వచ్చినదా ప్రేమే చావు కదా
మీకు మాకు వాదం తప్పు కదా
బ్రహ్మచారులు కొయ్యొద్దు కోతలు
వెనక నుంచి తీయవద్దు తీపి గొతులు
ఆడపిల్లలు అరె లేడి పిల్లలు
హంస నడక నేర్చుకున్న చేప పిల్లలు
మీ మాయ మాటలు నమ్మేది ఎవ్వరు
అరె ఆడగాలి సోకగానే రెచిపోదురు
ఆడపిల్లలు అరె లేడి పిల్లలు
హంస నడక నేర్చుకున్న చేప పిల్లలు
No comments:
Post a Comment
Have your say..